Oppo Find X10 Pro Max జబర్దస్త్ కెమెరా మరియు ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!
Oppo Find X10 Pro Max జబర్దస్త్ కెమెరా మరియు ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది
మొబైల్ మార్కెట్ చూడని ట్రిపుల్ 200MP పవర్ ఫుల్ కెమెరా సిస్టంతో లాంచ్ అయ్యింది
120 FPS 4K స్లో మోషన్ వీడియో సపోర్ట్ వంటి ప్రీమియం వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది
Oppo Find X10 Pro Max జబర్దస్త్ కెమెరా మరియు ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది. గత రెండు వారాలుగా ఒప్పో టీజింగ్ చేస్తున్న ఫైండ్ ఎక్స్ 10 సిరీస్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ని ఈరోజు విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పటి వరకు మొబైల్ మార్కెట్ చూడని ట్రిపుల్ 200MP పవర్ ఫుల్ కెమెరా సిస్టంతో లాంచ్ అయ్యింది. కేవలం ఈ ఫోన్ కెమెరా మాత్రమే ఈ ఫోన్లో ఉన్న ప్రత్యేకత కాదు ఓవరాల్ గా ఈ ఫోన్ మొత్తం కూడా ఒక ప్రత్యేకమైన ఫోన్ గా లాంచ్ అయింది.
SurveyOppo Find X10 Pro Max : ప్రైస్
ఒప్పో ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం సింగల్ వేరియంట్ లో లాంచ్ చేసింది. ఒప్పో ఫైండ్ ఎక్స్ 10 ప్రో మాక్స్ 12GB + 512GB స్టోరేజ్ తో రూ. 1,99,999 ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఒప్పో ప్రీమియం స్మార్ట్ ఫోన్ గా ప్రీమియం సెగ్మెంట్ లో పరిచయం చేసింది. ఈ ఫోన్ టైటానియం గ్రే మరియు లూనా వైట్ రెండు రంగుల్లో లభిస్తుంది
Oppo Find X10 Pro Max : ఫీచర్స్
ఒప్పో ఫైండ్ ఎక్స్ 10 ప్రో మాక్స్ స్మార్ట్ ఫోన్ 6.78 ఇంచ్ ఫ్లెక్సిబుల్ AMOLED స్క్రీన్ తో లాంచ్ అయ్యింది. ఈ స్క్రీన్ 1.5K రిజల్యూషన్, 1-120Hz అడాప్టర్ రిఫ్రెష్ రేట్ మరియు 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 9600 Pro ప్రీమియం అండ్ పవర్ ఫుల్ చిప్ సెట్ తో అందించింది. ఇది 2nm టెక్నాలజీ చిప్ సెట్ మరియు ఈ చిప్ సెట్ తో జతగా గరిష్టంగా 16 జీబీ LPDDR5X ర్యామ్ మరియు 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ని ఆఫర్ చేసింది.

ఈ ఫోన్ కెమెరా గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. ఎందుకంటే, ఈ ఫోన్ క్వాడ్ కెమెరా సెటప్ తో ఉంటే, అందులో మూడు 200MP కెమెరా ఉన్నాయి. ఈ సెటప్ లో 200MP మెయిన్ కెమెరా, 200MP టెలిఫోటో కెమెరా మరియు 200MP అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ 8K సినిమాటిక్ వీడియో, 120FPS 4K DOLBY VISION మరియు 120FPS 4K స్లో మోషన్ వీడియో సపోర్ట్ వంటి ప్రీమియం వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. అంతేకాదు, 8K అల్ట్రా క్లియర్ ఇమేజ్ ఫోటోలు కూడా అందిస్తుంది. ఈ ఫోన్ లో పూర్తిగా Hasselblad కెమెరా సిస్టం కెమెరాని అందించింది.
Also Read: Jio Offer: కేవలం రూ. 39 రీఛార్జ్ తో డైలీ 3GB డేటా అందించే జియో ప్లాన్ గురించి మీకు తెలుసా!
ఈ ఫోన్ 8000 mAh భారీ బ్యాటరీ కలిగి ఉంటుంది. అయినా కూడా ఒప్పో ఈ ఫోన్ ను కేవలం 8.40mm మందంతో మాత్రమే డిజైన్ చేసింది. ఈ ఫోన్ లో 80W SUPER VOOC ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు 50W AIR VOOC ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ని కూడా అందించింది. ఈ ఫోన్ కలర్ OS 17 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 17 OS తో లాంచ్ అయ్యింది. ఇది మెటల్ ఫ్రేమ్, ఆర్మర్ షీల్డ్ డ్యూరబుల్ డిజైన్ మరియు IP69 వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ తో వచ్చింది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
