OPPO Enco X4 ఇయర్ బడ్స్ LHDC లాస్ లెస్ ఫీచర్ తో లాంచ్ అయ్యింది.!

HIGHLIGHTS

OPPO Enco X4 ఇయర్ బడ్స్ LHDC లాస్ లెస్ ఫీచర్ తో లాంచ్ అయ్యింది

ఫైండ్ ఎక్స్ 10 సిరీస్ స్మార్ట్ ఫోన్లతో పాటు ఒప్పో ఎన్కో x4 ఇయర్ బడ్స్ ని కూడా రిలీజ్ చేసింది

ఈ బడ్స్ ని అనేక ప్రీమియం ఫీచర్స్ తో విడుదల చేసింది

OPPO Enco X4 ఇయర్ బడ్స్ LHDC లాస్ లెస్ ఫీచర్ తో లాంచ్ అయ్యింది.!

OPPO Enco X4 ఇయర్ బడ్స్ LHDC లాస్ లెస్ ఫీచర్ తో లాంచ్ అయ్యింది. ఈరోజు ఒప్పో నిర్వహించిన బిగ్ ఈవెంట్ నుంచి ఒప్పో ఫైండ్ ఎక్స్ 10 సిరీస్ స్మార్ట్ ఫోన్లతో పాటు ఒప్పో ఎన్కో x4 ఇయర్ బడ్స్ ని కూడా రిలీజ్ చేసింది. ఈ బడ్స్ ని అనేక ప్రీమియం ఫీచర్స్ తో విడుదల చేసింది. ఈ లేటెస్ట్ ఇయర్ బడ్స్ లాంచ్ ప్రైస్, ఆఫర్స్ మరియు ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఒక లుక్కేద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

OPPO Enco X4: ప్రైస్

ఒప్పో ఎన్కో ఎక్స్ 4 ఇయర్ బడ్స్ ను రూ. 19,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేసింది. ఈ బడ్స్ ను అరోరా వయొలెట్ మరియు గ్లేసియర్ వైట్ రెండు రంగుల్లో లాంచ్ చేసింది. ఈరోజు నుంచి ఈ బడ్స్ ప్రీ ఆర్డర్స్ కూడా స్టార్ట్ చేసింది. ఈ బడ్స్ పైన రూ. 1,000 ఇన్స్టాంట్ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ మరియు 12 నెలల నో EMI ఆఫర్ ని కూడా అందించింది.

OPPO Enco X4: ఫీచర్స్

ఒప్పో ఈ బడ్స్ ని డ్యూయల్ డ్రైవర్ సెటప్ తో అందించింది. ఇందులో 11mm ఉఫర్ + 6mm ట్వీటర్ ఉంటాయి. ఇది డ్యూయల్ DACs తో జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. ఒప్పో ఈ బడ్స్ లో క్రాస్ ఎకో సిస్టం స్పేషియల్ ఆడియో ఫీచర్ ని అందించింది. ఇది సౌండ్ అన్ని వైపుల నుంచి వస్తున్నట్లు వినిపిస్తుంది. ఈ బడ్స్ ను 2.3Mbps LHDC Lossless Audio మరియు HI-RES Audio వైర్లెస్ వంటి ప్రీమియం ఆడియో ఫీచర్స్ తో లాంచ్ చేసింది. ఈ ఫీచర్స్ తో ఈ బడ్స్ చాలా గొప్ప సౌండ్ ఆఫర్ చేస్తుంది.

OPPO Enco X4 EARBUDS

ఈ బడ్స్ ను Dynaudio సపోర్ట్ మరియు 10 బ్యాండ్ ఈక్వలైజర్ సపోర్ట్ అందించే సౌండ్ మాస్టర్ ఈక్వలైజర్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఒప్పో కొత్త ఇయర్ బడ్స్ రియల్ టైం డైనమిక్ ANC అండ్ అడాప్టివ్ ANC సపోర్ట్ తో చాలా క్లియర్ సౌండ్ అందిస్తుంది. అంతేకాదు, ఇది AAC, SBC, LHDC, LC3 ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఇది ఏఐ క్లియర్ కాల్ ఫీచర్ తో మంచి క్లియర్ కాల్స్ కూడా ఆఫర్ చేస్తుంది.

Also Read: Oppo Find X10 Pro Max జబర్దస్త్ కెమెరా మరియు ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!

ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే, ఈ బడ్స్ బ్లూటూత్ 6.1 సపోర్ట్ తో చాలా ఫాస్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. ఇది ఏకంగా 53 గంటల ప్లే బ్యాక్ అందిస్తుంది మరియు కేవలం 10 నిమిషాల ఫాస్ట్ ఛార్జ్ తో 14 గంటల ప్లే బ్యాక్ ఆఫర్ చేస్తుంది. ఇది IP55 రేటింగ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile