iPhone Duo ఫోన్ ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ .. బిగ్ డీల్స్ తో సేల్ మొదలయ్యింది.!

HIGHLIGHTS

iPhone Duo ఫోన్ ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్

యాపిల్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ఈరోజు నుంచి సేల్ కి అందుబాటులోకి బాటలోకి వచ్చింది

ఈ ఫోన్ లాంచ్ లో భాగంగా అందించిన బిగ్ డీల్స్ తో ఈ ఫోన్ ఈరోజు నుంచి సేల్ అవుతోంది

iPhone Duo ఫోన్ ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ .. బిగ్ డీల్స్ తో సేల్ మొదలయ్యింది.!

iPhone Duo ఫోన్ ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్, యాపిల్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ఈరోజు నుంచి సేల్ కి అందుబాటులోకి బాటలోకి వచ్చింది. డ్యూయల్ స్క్రీన్ తో అందించిన ఈ మడతపెట్టే స్మార్ట్ ఫోన్ నిన్నటి వరకు కేవలం ముందస్తు బుకింగ్స్ కోసం మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఫోన్ లాంచ్ లో భాగంగా అందించిన బిగ్ డీల్స్ తో ఈ ఫోన్ ఈరోజు నుంచి సేల్ అవుతోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

iPhone Duo : ప్రైస్

యాపిల్ ఈ స్మార్ట్ ఫోన్ ను నాలుగు వేరియంట్స్ లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ మూడు వేరియంట్ ధరల లిస్ట్ ఇక్కడ చూడొచ్చు.

  • ఐఫోన్ డుయో 256GB వేరియంట్ ప్రైస్ : రూ. 2,99,900
  • ఐఫోన్ డుయో 512GB వేరియంట్ ప్రైస్ : రూ. 3,24,900
  • ఐఫోన్ డుయో 1TGB వేరియంట్ ప్రైస్ : రూ. 3,74,900
  • ఐఫోన్ డుయో 2TGB వేరియంట్ ప్రైస్ : రూ. 4,49,900

ఈ ప్రీమియం స్మార్ట్ ఫోన్ స్టార్ వైట్ మరియు నైట్ స్కై అనే రెండు రంగుల్లో లభిస్తుంది. ఈరోజు నుంచి యాపిల్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ సేల్ కి అందుబాటులోకి వచ్చింది.

ఆఫర్స్

ఈ ఫోన్ పైన మంచి లాంచ్ ఆఫర్లు కూడా యాపిల్ అందించింది. అవేమిటంటే, ఈ ఫోన్ పైన ఎటువంటి వడ్డీ లేని 6 నెలల నో కాస్ట్ EMI ఆఫర్ మరియు రూ. 7,000 రూపాయల తక్షణ క్యాష్ బ్యాక్ ఆఫర్ ని కూడా అందించింది. అలాగే, ఫ్లిప్ కార్ట్ మరియు అమెజాన్ ప్లాట్ ఫామ్స్ కూడా ఈ ఫోన్ పైన మంచి బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించాయి.

iPhone Duo : ఫీచర్స్

ఈ ఫోన్ లో రెండు Super Retina XDR OLED డిస్‌ప్లేలు ఉన్నాయి. ఫోన్‌ ను తెరిచినప్పుడు 7.6 అంగుళాల ఇన్నర్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 1878 × 2670 పిక్సెల్ రిజల్యూషన్, 430 ppi పిక్సెల్ డెన్సిటీ తో వస్తుంది. అలాగే ఈ ఫోన్‌ ను మడిచినప్పుడు 5.4 అంగుళాల ఔటర్ డిస్‌ప్లే లభిస్తుంది. ఇది 1398 × 2034 పిక్సెల్ రిజల్యూషన్ మరియు 460 ppi పిక్సెల్ డెన్సిటీ కలిగి ఉంటుంది. రెండు స్క్రీన్‌ లు కూడా ప్రో మోషన్ టెక్నాలజీ తో 120Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌, Always-On Display, డైనమిక్ ఐల్యాండ్, HDR, True Tone, P3 వైడ్ వంటి ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటాయి. ఈ ఫోన్ తో USB-C తో కూడిన Apple Pencil సపోర్ట్ కూడా అందుబాటులోకి రానుంది.

ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్‌ Apple A20 Pro చిప్‌ సెట్‌ తో పని చేస్తుంది. ఇందులో 6-కోర్ CPU, 7-కోర్ GPU, రెండు 16-కోర్ Neural Engine యూనిట్లు ఉన్నాయి. అంతేకాదు, హార్డ్‌ వేర్ ఆధారిత రే ట్రేసింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఈ ఫీచర్స్ తో భారీ యాప్‌లు, మల్టీ టాస్కింగ్, హై-ఎండ్ గేమింగ్, ఫోటో ఎడిటింగ్, AI ఆధారిత పనులు చాలా వేగంగా మరియు స్మూత్ గా నిర్వహిస్తుంది.

Apple iPhone Duo

కెమెరా పరంగా, ఈ ఫోన్ వెనుక భాగంలో 48MP ఫ్యూజన్ మెయిన్ కెమెరా, 48MP ఫ్యూజన్ అల్ట్రా వైడ్ కెమెరాలతో డ్యూయల్ రియర్ కెమెరా ఉంది. ఈ ఫోన్ లో మాక్రో ఫోటోగ్రఫీ, నైట్ మోడ్, పోర్ట్రెయిట్ మోడ్, Smart HDR 5, Deep Fusion, Photonic Engine, ఫోటోగ్రాఫిక్ స్టైల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే, ముందు 18MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ 4K Dolby Vision వీడియోలు రికార్డ్ చేస్తుంది మరియు యాపిల్ కెమెరా ఫీచర్స్ అండ్ లేటెస్ట్ ఏఐ కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.

Also Read: Oppo ఈరోజు విడుదల చేసిన అన్ని ప్రొడక్ట్స్ ప్రైస్ అండ్ ఆఫర్స్ లిస్ట్ ఇదిగో.!

ఈ ఫోన్ లో రెండు భాగాల్లో అమర్చిన రీఛార్జ్ చేయగల లిథియం-అయాన్ బ్యాటరీలు ఉన్నాయి. Apple తెలిపిన వివరాల ప్రకారం, బయటి డిస్‌ప్లే పై వీడియోలను ప్లే చేస్తే 44 గంటల వరకు, లోపలి డిస్‌ప్లే పై 31 గంటల వరకు వీడియో ప్లే బ్యాక్ లభించవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile