నిన్నటి వరకు కేవలం Pre Orders కోసం మాత్రమే అందుబాటులో ఉన్న లేటెస్ట్ బడ్జెట్ యాపిల్ ఐఫోన్ సేల్ ఈరోజు నుంచి ప్రారంభం అయ్యింది. అంతేకాదు, iPhone 16e Sale ఆకట్టుకునే ఆఫర్స్ మరియు డీల్స్ తో ప్రారంభం అయ్యింది. ఈ ఫోన్ పైన అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ లు గొప్ప ఆఫర్స్ ప్రకటించాయి.
Survey
✅ Thank you for completing the survey!
iPhone 16e Sale: ఆఫర్స్
ఐఫోన్ 16e స్మార్ట్ ఫోన్ ఈరోజు నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ పై ఈరోజు అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ లు గొప్ప డీల్స్ కూడా ఆఫర్ చేస్తున్నాయి. ఐఫోన్ మూడు వేరియంట్స్ లో లభిస్తుంది.
ఫ్లిప్ కార్ట్ ఐఫోన్ 16e పై భారీ డీల్స్ అందించింది. ఈ ఫోన్ పై ICICI మరియు Kotak బ్యాంక్ కార్డ్ రూ. 4,000 డిస్కౌంట్ ఆఫర్ ఫ్లిప్ కార్ట్ అందించింది. అంతేకాదు, ఈ ఫోన్ పై రూ. 8,000 రూపాయల వరకు అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ కూడా అందించింది.
అమెజాన్ ఆఫర్స్:
అమెజాన్ ఈ ఫోన్ పై రూ. 4,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఫోన్ ను ICICI మరియు Kotak బ్యాంక్ కార్డ్ లతో కొనుగోలు చేసే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది.
యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ లో బడ్జెట్ ఫోన్ వచ్చిన ఈ ఐఫోన్ 16e స్మార్ట్ ఫోన్ A18 Chip తో పని చేస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో అధిక సమయం నిలిచి ఉండే బ్యాటరీ ఉన్నట్లు కూడా యాపిల్ ప్రకటించింది. ఈ ఫోన్ లో 6.1 Super Retina XDR డిస్ప్లే ఉంటుంది. ఈ ఫోన్ ఎమర్జెన్సీ SOS మరియు క్రాష్ డిటెక్షన్ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.
ఈ బడ్జెట్ ఐఫోన్ లో వెనుక 48MP Fusion కెమెరా వుంది. ఈ కెమెరా 2x ఆప్టికల్ జూమ్ మరియు స్టన్నింగ్ ఫోటోలు అందిస్తుంది. ఈ ఫోన్ లో ముందు 12MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ కేవలం బ్లాక్ మరియు వైట్ రెండు రంగుల్లో లభిస్తుంది.