Apple iPhone 16 మరియు iPhone 16 Plus లను యాపిల్ ఇంటెలిజెన్స్ తో లాంచ్ చేసింది.!
Apple లాంచ్ ఈవెంట్ నుంచి iPhone 16 మరియు iPhone 16 Plus లను విడుదల చేసింది
యాపిల్ ఈ ఫోన్ లను Apple Intelligence సపోర్ట్ తో అందించింది
ఈ ఫోన్ లను సరికొత్త క్లాసీ లుక్ తో చాలా సుందరంగా ఉండేలా అందించింది
ఈరోజు Apple నిర్వహించిన అతిపెద్ద లాంచ్ ఈవెంట్ it’s Glow Time నుంచి iPhone 16 మరియు iPhone 16 Plus లను విడుదల చేసింది. ఈ సిరీస్ ముందు జెనరేషన్ సిరీస్ అయిన iPhone 15 మరియు iPhone 15 Plus ఫోన్ లకు మంచి అప్గ్రేడ్ లతో ఈ సిరీస్ ను అందించింది. ఈ ఫోన్ లలో ఒక కొత్త ఫీచర్ ను కూడా యాపిల్ పరిచయం చేసింది. యాపిల్ ఈరోజే సరికొత్తగా విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు ఉన్నాయో ఒక లుక్కేద్దాం పదండి.
SurveyApple iPhone 16 మరియు iPhone 16 : ఫీచర్లు
ఐఫోన్ గత సిరీస్ లతో పోలిస్తే, ఐఫోన్ 16 సిరీస్ లో కొత్త అప్డేట్ గా ఈ ఫోన్ ల డిజైన్ గురించి మాట్లాడవచ్చు. ఎందుకంటే, ఐఫోన్ 15 సిరీస్ చూడని కొత్త కస్టమైజ్డ్ బటన్ తో అందించింది. ఈ ఫోన్ లను కూడా అల్యూమినియం బాడీ తో అందించింది. అయితే, ఈ ఫోన్ లను సరికొత్త క్లాసీ లుక్ తో చాలా సుందరంగా ఉండేలా అందించింది. ఈ ఫోన్ లు చూడటానికి ఎంత అందంగా ఉన్నాయో, అంతకంటే కఠినంగా కూడా ఉంటాయి. అంతేకాదు, యాపిల్ ఈ ఫోన్ లను Apple Intelligence సపోర్ట్ తో అందించింది.

Also Read: Apple Watch 10 Series: పెద్ద స్క్రీన్ మరియు స్లీక్ డిజైన్ తో వచ్చింది.!
ఈ రెండు కొత్త యాపిల్ ఐఫోన్ లు కూడా A18 Bionic చిప్ సెట్ తో పని చేస్తాయి మరియు ఇది 3nm చిప్ సెట్. ఈ చిప్ సెట్ 16- కోర్ న్యూరల్ న్యూరల్ ఇంజిన్ తో పని చేస్తుంది. ఇందులో 6 కోర్ CPU మరియు 5 కోర్ GPU లను కలిగి ఉంటుంది.
ఇక కెమెరా డీటెయిల్స్ లోకి వెళితే, ఐఫోన్ 16 మరియు ఐఫోన్ 16 రెండు ఫోన్లు కూడా డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉన్నాయి. ఇందులో OIS సపోర్టెడ్ 48MP మెయిన్ సెన్సార్ మరియు 12MP అల్ట్రా వైడ్ సెన్సార్ ఉన్నాయి. ఈ ఫోన్ మెయిన్ కెమెరా 2X ఆప్టిక్ జూమ్ తో వస్తుంది. ఈ కెమెరా ఆప్టికల్ జూమ్ మరియు 10x డిజిటల్ జూమ్ సపోర్ట్ తో ఉంటుంది. ఈ ఫోన్ లో ఉన్న 12MP అల్ట్రా వైడ్ సెన్సార్, మ్యాక్రో సెన్సార్ గా కూడా పని చేస్తుంది.
ఇక ఈ ఫోన్స్ కెమెరా ఫీచర్స్ వివరాల్లోకి వెళితే, ఈ రెండు ఫోన్లు కూడా 24 fps, 25 fps, 30 fps or 60 fps వద్ద 4K వీడియో రికార్డ్ సపోర్ట్ తో వస్తాయి. ఈ ఫోన్స్ కెమెరాతో Dolby Vision HDR 4K వీడియో రికార్డింగ్ ను 60 FPS వద్ద షూట్ చేయవచ్చని యాపిల్ తెలిపింది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile