ఆండ్రాయిడ్ కొత్త వెర్షన్ 6.0 – మార్ష్ మల్లో రిలీజ్ అప్ డేట్ కన్ఫర్మ్
అనుకోకుండా ఒక కెనడియన్ వెబ్ సైట్ ద్వారా తెలిసింది.
కెనడియన్ మొబైల్ ప్రొవైడర్, Telus తన అఫిషియల్ వెబ్ సైట్ లో ఆండ్రాయిడ్ 6 కొన్ని ఆండ్రాయిడ్ ఫ్లాగ్ షిప్ మోడల్స్ కు వస్తున్నాయని చెప్పేందుకు మొబైల్స్ లిస్టింగ్ చేసి, అప్ డేట్ ఎప్పుడు వస్తుందో అని కూడా డేట్ పోస్ట్ చేసింది.
Surveyఈ పోస్ట్ ఆధరంగా ఆండ్రాయిడ్ M అక్టోబర్ 5 న selected అన్నీ మొబైల్స్ కు రోల్ అవుట్ అవనుంది. కొన్ని ఇతర ఫ్లాగ్ షిప్ మోడల్స్ తో పాటు నేక్సాస్ 5 అండ్ నేక్సాస్ 6 కు ఈ అప్ డేట్ అక్టోబర్ 6 న వస్తుంది అని చెప్పింది. కాని పోస్ట్ అయిన వెంటనే సైట్ ఆ లిస్టింగ్ ను రిమూవ్ చేసింది.
గూగల్ ఈ నెల 29 న అంటే రేపే ఒక ఈవెంట్ ను చేస్తున్నట్లు ఇదివరుకే invite లను పంపింది. ఈ ఈవెంట్ లో రెండు కొత్త నేక్సాస్ ఫోనులు అనౌన్స్ అవనున్నాయి అని రిపోర్ట్స్.
ఒకటి LG మరొకటి Huawei కంపెనీల చే తయారు చేయబడతాయి. సో ఈ రెండే మొదటిగా ఆండ్రాయిడ్ M తో బయటకు రానున్నాయి. అంటే అదే ఆండ్రాయిడ్ M రోలింగ్ డేట్ అని అంచనాలు.
ఇంతకముందే ఈ రెండు అప్ కమింగ్ నేక్సాస్ మోడల్స్ యొక్క ప్యాకేజింగ్ బాక్స్ ఇమేజ్ లు లీక్ అయ్యాయి. వాటి ప్రకారం తెలిసిన విషయాలు.. ఇవి నేక్సాస్ 5X అండ్ నేక్సాస్ 6P అనే పేరులతో, ఇంబిల్ట్ 32gb స్టోరేజ్ తో రానున్నాయని న్యూస్.
ఆధారం: మొబైల్ syrup
Writer, gamer, and hater of public transport. View Full Profile
