ఈ Realme ఫోన్లు వాడుతున్న వారికీ గుడ్ న్యూస్

ఈ Realme ఫోన్లు వాడుతున్న వారికీ గుడ్ న్యూస్
HIGHLIGHTS

రియల్మీ స్మార్ట్ ఫోన్ల కోసం Android 11 అప్డేట్

"ఆప్టిమైజ్డ్ నైట్ ఛార్జింగ్" అనే కొత్త ఫీచర్

అప్డేట్ Realme UI 2.0 స్టేబుల్ వెర్షన్ తో ఇది అందుతుంది

ఈ Realme ఫోన్లు వాడుతున్న వారికీ గుడ్ న్యూస్. అదేమిటంటే, రియల్మి ఇటీవల విడుదల చేసిన రెండు రియల్మీ స్మార్ట్ ఫోన్ల కోసం Android 11 అప్డేట్ ను ప్రకటించింది. ఈ అప్డేట్ Realme UI 2.0 స్టేబుల్ వెర్షన్ తో ఇది అందుతుంది. ఇప్పటికే, కొంత మంది యూజర్లు ఈ అప్డేట్ కోసం నోటిఫికేషన్ అందుకున్నారు. ఈ కొత్త అప్డేట్ అందుకోవడానికి A.37(RMX2170PU_11.A.37) వెర్షన్ కి అప్డేట్ అయ్యి ఉండాలి. ఈ విషయాన్ని తన బ్లాగ్ ద్వారా వెల్లడించింది. ఈ ఆండ్రాయిడ్ 11 అప్డేట్ ను Realme 6 Pro మరియు Realme 7 Pro యూజర్ల కోసం ప్రకటించింది.

ఇక ఈ కొత్త అప్డేట్ తో కొన్ని సలహాలను సూచనలను కూడా వెల్లడించింది. ఇందులో, ఈ అప్గ్రేడ్ తరువాత మొదటిసారి రీబూట్ అవ్వడానికి చాలా సమయం పడుతుందని సూచించింది. ఈ అప్గ్రేడ్ తరువాత, ఫోన్ సామర్ధ్యాలను పెంచడానికి మరియు అనుకోని సేఫ్టీ రిస్క్ లను తొలగించడానికి బ్యాగ్రౌండ్ ఆప్టిమైజేషన్, సెక్యూరిటీ స్కాన్ వంటి కొన్ని పనులను చేస్తుంది. కాబట్టి, CPU, మెమొరీని కొంత ఆక్రమిస్తుంది.

అంతేకాదు, ఈ పనులన్నిటినీ ఒకేసారి నిర్వహిస్తుంది కాబట్టి, బ్యాటరీలో కొంత భాగం త్వరగా డ్రైన్ అవుతుంది. కొత్త అప్డేట్ తరువాత ఎటువంటి మార్పులు లేదా కొత్త విషయాలు వచ్చి చేరుతాయని చూస్తే, మూడు రకాలైన డార్క్ మోడ్స్ అందుకుంటారు. మీ ఇష్టాన్ని బట్టి  మీకు నచ్చిన దానిని సెట్ చేసుకోవచ్చు.అలాగే, మీ ఫోటోతో మీకు నచ్చిన కలర్ లో వాల్ పేపర్ ను క్రియేట్ చేసుకోవచ్చు. రాత్రి సమస్యలో బ్యాటరీ లైఫ్ పెంచేందుకు వీలుగా "ఆప్టిమైజ్డ్ నైట్ ఛార్జింగ్" అనే కొత్త ఫీచర్ అందుతుంది. ఇంకా చాలా కొత్త ఫీచర్లను ఈ అప్డేట్ తో జతచేసింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo