సరికొత్త Realme UI తో ఆండ్రాయిడ్ 10 అప్డేట్ అందుకున్న రియల్మీ ఫోన్లు : ఇవే టాప్ 5 ఫీచర్లు

సరికొత్త Realme UI తో ఆండ్రాయిడ్ 10 అప్డేట్ అందుకున్న రియల్మీ ఫోన్లు : ఇవే టాప్ 5 ఫీచర్లు
HIGHLIGHTS

ఈ 5 ఫీచర్లు మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని ఆకట్టుకుంటాయి.

రియల్మీ వినియోగదారులు ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న ఆండ్రాయిడ్ 10 అప్డేట్ ఎట్టకేలకు వారి స్మార్ట్ ఫోన్లకు చేరుతోంది.  రియల్మీ ముందుగా ప్రకటించిన ప్రకారం, జనవరి మొదలుకొని ఈ సంవత్సరంలో అన్ని ఫోన్లకు ఈ ఆండ్రాయిడ్ 10 అప్డేట్ ను అందించనున్నట్లు చెప్పింది. ఇక తన స్మార్ట్ ఫోన్ల కోసం సరికొత్త Realme UI ని కూడా విడుదల చేసింది మరియు ఇది రియల్మీ UI 1.0 వెర్షన్ తో వస్తుంది. ఈ అప్డేట్, జనవరి నెలలో అన్నింటి కన్నా ముందుగా రియల్మీ XT మరియు రియల్మీ 3 ప్రో స్మార్ట్ ఫోన్లకు అందనునట్లు తెలిపింది.

 

అయితే, కొన్ని టెక్నీకల్ సమస్యల కారణంగా ఈ అప్డేట్ కొన్ని ఫోన్లలో అందక పోవడం దురదృష్టకరం. కానీ, ఇప్పటికే కొన్ని రియల్మీ 3 ప్రో మరియు రియల్మీXT  ఫోన్లలో ఈ అప్డేట్ అందినట్లు తెలుస్తోంది. అయితే, ఎవరికైతే ఈ అప్డేట్ అందలేదో అటువంటి వారికి OTA అప్డేట్ కోసం కూడా ఆహ్వానాన్ని అందించింది మరియు ఎవరైతే ఇందులో సైన్ అప్ చేస్తారో వారికీ ఈ అప్డేట్ త్వరగా అందుతుంది. జనవరి 23 వ తేదీ తరువాత ఈ అప్డేట్ కోసం అప్లై చేసేవారు ఫిబ్రవరి 7 వ తేదీవరకూ ఈ అదుపేట్ పొందుతారు.

ఈ అప్డేట్ తో చాల కొత్త ఫీచర్లు అందుకుంటారు. అయితే, వాటిలో ఈ 5 ఫీచర్లు మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని ఆకట్టుకుంటాయి.

1. డార్క్ మోడ్

అన్ని ఫీచర్లలలో కూడా మీకు ఎక్కువ ఉపయోగపడే మరియు మీరు ఇష్టపడే ఫీచరుగా దీని గురించి చెప్పొచ్చు. ఈ అప్డేట్ తో మీకు డార్క్ మోడ్ అందుతుంది. దీన్ని ఎనేబుల్ చెయ్యడానికి మీరు  సెట్టింగ్స్ లోకి వెళ్లి, డిస్ప్లే & బ్రైట్నెస్ ను ఎంచుకోవాలి అక్కడ మీకు డార్క్ మోడ్ కనిపిస్తుంది మరియు ఇక్కడ దీన్ని మీరు ఎనేబుల్ చెయ్యొచ్చు. ఇక్కడ మీకు కొన్ని అదనపు ఎంపికలను కూడా రియల్మీ అందించింది.

2. రియల్మీ స్మార్ట్ సైడ్ బార్

ఈ కొత్త అప్డేట్ తో మీకు ఈ ఫీచర్ అందుతుంది మరియు ఇది మీకు సౌకర్యవంతమైన వినియోగాన్ని అందిస్తుంది. దీనితో మీరు చాలా సులభంగా ఒక్క చేతితో వాడుకునే వీలుంటుంది. ఇందులో మీకు "Assistive Ball Opacity" మరియు "Hide Assistive Ball On Full Screen App" అనే రెండు కొత్త ఫీచర్లను కొత్తగా జత చేసింది. అంటే, మీకు ఫోన్ యొక్క రైట్ సైడ్ లో ఒక మినీ బార్ అందుతుంది మరియు దీనిలో మీకు కావాల్సిన లేదా క్విక్ ఆప్స్ ఇందులో ఉంచవచ్చు.          

3. స్క్రీన్ షాట్

ఈ కొత్త అప్డేట్ తరువాత మీ ఫోనుతో స్క్రీన్ షాట్ ను తియ్యడం చాలా తేలికవుతుంది. మీ ఫోను యొక్క స్క్రీన్ పైన కేవలం మూడు వేళ్ళను పెట్టి డ్రాగ్ చెయ్యడం ద్వారా మీరు ఆ చుట్టును స్క్రీన్ షాట్ తియ్యవచ్చు. ఇక మూడు వేళ్ళను స్కరేం పైన పెట్టి పై నుండి క్రింద వరకూ లాగడం ద్వారా లాంగ్ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు.

4. సిస్టం & సెక్యూరిటీ

ఇందులో మీకు కొత్త రింగ్ టోన్స్ లభిస్తాయి మరియు స్క్రీన్ రికార్డింగ్ కోసం పాస్ బటన్ కొత్తగా జతచేయబడింది. ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే, మీకు ఇక్కడ సరికొత్త  ఛార్జింగ్ యానిమేషన్ కనిస్తుంది. మీ ఫోన్ wifi కి కనెక్ట్ చేసినప్పుడు మీ ప్రైవసీ కి డోకాలేకుండా మరియు యాడ్స్ ను కట్టడి చేసేలా ర్యాండమ్ మ్యాక్ అడ్రెస్స్ ని ఇచ్చింది.

5. గేమ్స్ 

ఈ అప్డేట్ లో గేమింగ్ కోసం మంచి విషయాలను తీసుకొచ్చింది. గేమ్ స్పేస్ కోసం విజువల్ ఇంటరాక్షన్స్ మరింతగా ఆప్టిమైజ్ చేయబడ్డాయి మరియు గేమ్ స్పేస్ లోడింగ్  యానిమేషన్ కూడా ఆప్టిమైజ్ చెయ్యబడింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo