అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దివాళి స్పెషల్ సేల్ నుంచి ఈరోజు మంచి స్మార్ట్ ఫోన్ డీల్స్ ఆఫర్ చేస్తోంది. ఈ దీపావళి పండుగ సందర్భంగా కొత్త 5జి స్మార్ట్ ఫోన్ ఆఫర్స్ కోసం చూసే వారికి ఈరోజు అమెజాన్ సేల్ నుంచి గొప్ప డీల్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే, మీరు కేవలం రూ. 6,000 ధరలో 4K కెమెరా కలిగిన 5G స్మార్ట్ ఫోన్ డీల్ కోసం చూస్తుంటే ఒకే ఒక ఆఫర్ మీకు Amazon Sale నుంచి అందుబాటులో ఉంది. అమెజాన్ ఈరోజు ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ డీల్ ఏమిటో చూసేద్దామా.
Survey
✅ Thank you for completing the survey!
Amazon Sale 4K 5G స్మార్ట్ ఫోన్ ఆఫర్
లావా కొత్తగా విడుదల చేసిన Lava Bold N1 5G స్మార్ట్ ఫోన్ ఈ ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ రోజు అమెజాన్ అందించిన 30% భారీ డిస్కౌంట్ ఆఫర్ తో కేవలం రూ. 6,999 రూపాయల ఆఫర్ ధరతో సేల్ అవుతోంది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ ని అమెజాన్ సేల్ నుంచి HDFC బ్యాంక్ డెబిట్ మరియు డెబిట్ కార్డ్ EMI ఆప్షన్ తో తీసుకునే వారికి రూ. 699 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ లావా స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 6,300 ఆఫర్ ధరకే లభిస్తుంది. Buy From Here
ఈ లావా బోల్డ్ ఎన్1 స్మార్ట్ ఫోన్ 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. ఇందులో 13MP మెయిన్ కెమెరా మరియు ముందు 5MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 3 లక్షల 80 వేల కు పైగా AnTuTu స్కోర్ కలిగిన UNISOC T765 ఆక్టా కోర్ 5జి చిప్ సెట్ కలిగి ఉంటుంది. ఇందులో 4 జీబీ ఫిజికల్ ర్యామ్, 4 జీబీ వర్చువల్ ర్యామ్ మరియు 64 జీబీ ఇంట్నర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఈ లావా బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ HD+ రిజల్యూషన్ కలిగిన 6.75 ఇంచ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 90Hz రిఫ్రెష్ రేట్ మరియు మంచి బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 5000 mAh బిగ్ బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP54 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ స్ప్లాష్ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది. ఈ లావా స్మార్ట్ ఫోన్ ఫేస్ అన్లాక్ మరియు సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ బ్లూ మరియు గోల్డ్ రెండు కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది.