పండుగ ముగిసినా ఆగని ఆఫర్లు: OPPO Reno 13 5G పై భారీ డిస్కౌంట్ ప్రకటించిన అమెజాన్.!
గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నిన్నటితో ముగిసినా ఆఫర్లు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి
ఈరోజు స్మార్ట్ ఫోన్ తో పాటు మరిన్ని ప్రొడక్ట్స్ పై భారీ డీల్స్ మరియు ఆఫర్స్ ప్రకటించింది
OPPO Reno 13 5G స్మార్ట్ ఫోన్ పై అందించిన భారీ డిస్కౌంట్ ఆఫర్ అందరినీ ఆకర్షిస్తోంది
2025 దీపావళి పండుగ కోసం అమెజాన్ ఇండియా ప్రకటించిన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నిన్నటితో ముగిసినా ఆఫర్లు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈరోజు స్మార్ట్ ఫోన్ తో పాటు మరిన్ని ప్రొడక్ట్స్ పై భారీ డీల్స్ మరియు ఆఫర్స్ ప్రకటించింది. వీటిలో ముఖ్యంగా OPPO Reno 13 5G స్మార్ట్ ఫోన్ పై అందించిన భారీ డిస్కౌంట్ ఆఫర్ అందరినీ ఆకర్షిస్తోంది. ఎందుకంటే, ఈరోజు అమెజాన్ ఇండియా ఈ ఫోన్ పై 16 వేల రూపాయల భారీ డిస్కౌంట్ అందించి సేల్ చేస్తోంది.
SurveyOPPO Reno 13 5G : అమెజాన్ ఆఫర్
ఒప్పో రెనో 13 స్మార్ట్ ఫోన్ ఈ సంవత్సరం ప్రారంభంలో రూ. 37,999 రూపాయల స్టార్టింగ్ ధరతో ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ఈరోజు అమెజాన్ నుంచి రూ. 14,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 23,999 రూపాయల ఆఫర్ ప్రైస్ తో సేల్ అవుతోంది. ఇది కాకుండా ఈ ఫోన్ మరో రెండు భారీ డీల్స్ కూడా అమెజాన్ జత చేసింది.
అవేమిటంటే, ఈ ఫోన్ పై రూ. 1,000 రూపాయల అదనపు డిస్కౌంట్ మరియు HDFC బ్యాంక్ కార్డ్ పై రూ. 1,250 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్ అందించింది. అమెజాన్ ఈరోజు ఈ ఫోన్ పై అందించిన మూడు డిస్కౌంట్ ఆఫర్స్ అందుకుంటే, ఈ ఫోన్ కేవలం రూ. 21,749 రూపాయల అతి తక్కువ ధరకే మీ సొంతం అవుతుంది. అంటే, ఈ ఫోన్ పై టోటల్ 16,250 రూపాయల భారీ డిస్కౌంట్ మీకు లభిస్తుంది. Buy From Here
OPPO Reno 13 5G : ఫీచర్స్
ఈ ఒప్పో రెనో 13 స్మార్ట్ ఫోన్ ఏరో స్పేస్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్ తో ఈ సెగ్మెంట్ లో వచ్చిన మొదటి ఫోన్ గా నిలిచింది. అంటే, ఈ ఫోన్ చాలా పటిష్టమైన గట్టి బిల్ కలిగి ఉంటుంది మరియు గొరిల్లా గ్లాస్ 7i రక్షతో మరింత సురక్షితంగా ఉంటుంది. ఈ ఫోన్ 3.35GHz క్లాక్ స్పీడ్ కలిగిన మీడియాటెక్ Dimensity 8350 చిప్ సెట్ తో పని చేస్తుంది మరియు జతగా 8 జీబీ ర్యామ్ అండ్ 128 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో మరింత గొప్ప సిగ్నల్స్ కోసం ప్రత్యేకమైన ఒప్పో సిగ్నల్ బూస్టర్ చిప్ కూడా ఉంటుంది.

ఈ ఒప్పో ఫోన్ 6.59 ఇంచ్ OLED Quad-Curve స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ HDR10+ సపోర్ట్, 1.5K రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 50MP (Sony LYT600) మెయిన్, 8MP అల్ట్రా వైడ్ మరియు 2MP మోనోక్రోమ్ కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ మరియు ముందు 50MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4K 60FPS వద్ద వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 5600 mAh బిగ్ బ్యాటరీని 80W సూపర్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP69 రేటింగ్ మరియు అండర్ వాటర్ ఫోటోగ్రఫీ ఫీచర్ తో కూడా వస్తుంది.
Also Read: boAt 5.1.2 Dolby Atmos సౌండ్ బార్ భారీ డిస్కౌంట్ తో 11 వేలకే లభిస్తోంది.!
ఓవరాల్ గా ఈరోజు లభిస్తున్న ఈ ఒప్పో స్మార్ట్ ఫోన్ ఆఫర్ గురించి చెప్పాలంటే, ఈ బడ్జెట్ సెగ్మెంట్ ప్రైస్ లో గొప్ప డ్యూరబుల్ అండ్ పెర్ఫార్మెన్స్ అందించే ఫోన్ అని సింపుల్ గా తేల్చి చెప్పొచ్చు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile