Amazon Sale Deals: అమెజాన్ బిగ్ సేల్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ బెస్ట్ డీల్స్ ను ఒక్కోక్కటిగా విడుదల చేస్తోంది. ఈ సేల్ ప్రారంభం కావడానికి రెండు రోజులు ఉండగా, ఈ రోజు కూడా కొత్త డీల్స్ ను అనౌన్స్ చేసింది. అమెజాన్ GIF సేల్ లో భాగంగా OnePlus Nord CE4 ఫోన్ కొంటే బడ్స్ ఉచితం అందుకోవచ్చని తెలిపింది. ఈ లేటెస్ట్ డీల్ మరియు ఈ ఫోన్ పై అందించిన మరిన్ని ఆఫర్లు ఈరోజు తెలుసుకోండి.
Survey
✅ Thank you for completing the survey!
Amazon Sale Deals:
సెప్టెంబర్ 27 వ తేదీ నుంచి మొదలవనున్న అమెజాన్ అతిపెద్ద సేల్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ను భారీ ఆఫర్స్ ను ప్రకటిస్తోంది. ఈ సేల్ నుంచి అందించనున్న బెస్ట్ డీల్స్ ను ఇప్పటికే రివీల్ చేసింది. ఈ ఫోన్ సేల్ నుంచి వన్ ప్లస్ లేటెస్ట్ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్ నార్డ్ CE 4 పై మంచి ఆఫర్లు ప్రకటించింది.
అమెజాన్ సేల్ నుంచి వన్ ప్లస్ నార్డ్ CE 4 ఫోన్ ను కొనుగోలు చేసే యూజర్లు రూ. 1,599 రూపాయల విలువైన వన్ ప్లస్ నార్డ్ బడ్స్ 2r ట్రూ వైర్లెస్ బడ్స్ ను ఉచితంగా అందుకోవచ్చని ప్రకటించింది. ఇది మాత్రమే కాదు ఈ సేల్ నుంచి ఈ ఫోన్ పై రూ. 2,000 బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ రూ. 22,249 ధరకే పొందవచ్చని మరియు బడ్స్ ను కూడా ఉచితంగా అందుకోవచ్చని అనౌన్స్ చేసింది.
వన్ ప్లస్ నార్డ్ CE4 స్మార్ట్ ఫోన్ ను Snapdragon 7 Gen 3 చిప్ సెట్ జతగా 8GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో అందించింది. ఈ ఫోన్ లో ఆక్వా టచ్ ఫీచర్ కలిగిన 120Hz AMOLED స్క్రీన్ మరియు 5500 mAh బ్యాటరీ ఉన్నాయి. ఈ ఫోన్ లో అల్ట్రా ఫాస్ట్ ఛార్జ్ కోసం ఇందులో 100W Super Vooc ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ను అందించింది.
ఈ ఫోన్ డాజ్లింగ్ డ్యూరబుల్ డిజైన్ మరియు రెండు అందమైన కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది. ఈ వన్ ప్లస్ మిడ్ రేంజ్ ఫోన్ OIS సపోర్ట్ కలిగిన SONY LYT-600 (IMX882) 50MP డ్యూయల్ రియర్ కెమెరా సిస్టం మరియు ఎక్స్ పాండబుల్ ఫీచర్ తో కూడా వస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile