ప్రైమ్ డే బిగ్ డీల్ గా Samsung Galaxy S25 Ultra ఫోన్ ని ప్రకటించిన అమెజాన్.!

HIGHLIGHTS

ప్రైమ్ డే బిగ్ డీల్ గా Samsung Galaxy S25 Ultra ఫోన్ డీల్ ని అమెజాన్ ప్రకటించింది

అతి తక్కువ ధరలో అందుకోవచ్చని ఈ ఫోన్ డీల్ గురించి అమెజాన్ ఈరోజు అనౌన్స్ చేసింది

అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుంచి ఆఫర్ చేయనున్న ఈ డీల్ ప్రైస్ ని కూడా ముందుగా రివీల్ చేసింది

ప్రైమ్ డే బిగ్ డీల్ గా Samsung Galaxy S25 Ultra ఫోన్ డీల్ ని అమెజాన్ ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుంచి మునుపెన్నడు చూడనంత అతి తక్కువ ధరలో అందుకోవచ్చని ఈ ఫోన్ డీల్ గురించి అమెజాన్ ఈరోజు అనౌన్స్ చేసింది. అంతేకాదు, అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుంచి ఆఫర్ చేయనున్న ఈ ఫోన్ డీల్ ప్రైస్ ని కూడా ముందుగానే రివీల్ చేసింది. మరి అమెజాన్ ఈరోజు ప్రత్యేకంగా రివిల్ చేసిన ఈ బిగ్ స్మార్ట్ ఫోన్ డీల్ వివరాలు ఏమిటో చూద్దామా.

Samsung Galaxy S25 Ultra : ప్రైమ్ డే ఆఫర్

సాంసంగ్ గెలాక్సీ s25 అల్ట్రా స్మార్ట్ ఫోన్ భారత్ మార్కెట్లో రూ. 1,29,999 ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. అయితే, అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుంచి 45 వేల రూపాయల భారీ డిస్కౌంట్ ఆఫర్లతో రూ. 84,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుందని అమెజాన్ ప్రకటించింది.

వాస్తవానికి, ఈ శాంసంగ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ఈరోజు కూడా రూ. 99,999 ప్రైస్ తో అమెజాన్ నుంచి లిస్ట్ అయ్యింది. అంటే, ఈ ఫోన్ ఈరోజు లిస్ట్ అయిన ధరతో పోలిస్తే కూడా దాదాపు 15 వేల రూపాయల డిస్కౌంట్ ధరలో ప్రైమ్ డే సేల్ న నుంచి లభిస్తుంది. అంతేకాదు, ఈ ప్రైస్ లో ఈ ఫోన్ లభిస్తే, గతంలో జరిగిన అన్ని సేల్స్ కంటే కూడా ఈ ఫోన్ ఈ ప్రైమ్ డే 2026 సేల్ నుంచి అతి తక్కువ ధరలో లభిస్తుంది.

Samsung Galaxy S25 Ultra : ఫీచర్స్

ఈ ప్రీమియం స్మార్ట్ ఫోన్ అత్యాధునిక AI ఫీచర్లు, శక్తివంతమైన పెర్ఫార్మెన్స్ మరియు ప్రీమియం డిజైన్‌తో రూపొందించబడిన ఫ్లాగ్‌ షిప్ స్మార్ట్‌ ఫోన్. ఇందులో 6.9 అంగుళాల QHD+ డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లే 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌ తో వస్తుంది. ఈ ఫోలే క్వాల్కమ్ Snapdragon 8 Elite ప్రాసెసర్ తో జతగా 12GB RAM మరియు 256GB స్టోరేజ్ తో వస్తుంది. ఇది మల్టీటాస్కింగ్ మరియు హెవీ గేమింగ్‌ ను సైతం సులభంగా నిర్వహిస్తుంది.

ఫోటోగ్రఫీ కోసం ఈ ఫోన్ లో 200MP ప్రధాన కెమెరా, 50MP అల్ట్రా వైడ్, 50MP పెరిస్కోప్ టెలిఫోటో, 10MP టెలిఫోటో కెమెరాలు మరియు ముందు 12MP సెల్ఫీ కెమెరా అందుబాటులో ఉన్నాయి. ఇది AI ఆధారిత కెమెరా ఫీచర్లు అద్భుతమైన ఫోటోలు, వీడియోలు అందిస్తాయి. ముఖ్యంగా, ఈ ఫోన్ 8K UHD వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Also Read: Nothing Phone 4b: అప్ కమింగ్ ఫోన్ కీలక ఫీచర్ విడుదల చేసిన నథింగ్.!

ఈ ఫోన్‌ లో 5,000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ మరియు రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ ఉన్నాయి. ఇది S Pen సపోర్ట్ తో పాటు IP68 వాటర్ మరియు డస్ట్ రెసిస్టెన్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ బలమైన టైటానియం ఫ్రేమ్ మరియు Gorilla Armor 2 రక్షణతో ప్రీమియం లుక్‌ తో కనిపించడమే కాకుండా చాలా దృఢంగా కూడా ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :