Nothing Phone 4b: అప్ కమింగ్ ఫోన్ కీలక ఫీచర్ విడుదల చేసిన నథింగ్.!

HIGHLIGHTS

నథింగ్ ఫోన్ 4బి ప్రధాన ఫీచర్స్ ఇప్పుడు ఒక్కొక్కటిగా నథింగ్ రివీల్ చేయడం ప్రారంభించింది

నథింగ్ ప్రతిష్టాత్మకంగా రిలీజ్ చేయబోతున్న అప్ కమింగ్ ఫోన్ Nothing Phone 4b

ఇప్పటికే నెట్టింట్లో లీకైన నథింగ్ అప్ కమింగ్ ఫోన్ ఫీచర్స్ ను నిజం చేసేలా ఉంది

Nothing Phone 4b: అప్ కమింగ్ ఫోన్ కీలక ఫీచర్ విడుదల చేసిన నథింగ్.!

Nothing Phone 4b: నథింగ్ ప్రతిష్టాత్మకంగా రిలీజ్ చేయబోతున్న అప్ కమింగ్ ఫోన్ నథింగ్ ఫోన్ 4బి ప్రధాన ఫీచర్స్ ఇప్పుడు ఒక్కొక్కటిగా నథింగ్ రివీల్ చేయడం ప్రారంభించింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ప్రాసెసర్ వెల్లడిస్తూ కొత్త టీజర్ ను ఈరోజు నథింగ్ విడుదల చేసింది. ఇది ఇప్పటికే నెట్టింట్లో లీకైన నథింగ్ అప్ కమింగ్ ఫోన్ ఫీచర్స్ ను నిజం చేసేలా ఉంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Nothing Phone 4b: లాంచ్ డేట్

నథింగ్ ఫోన్ 4బి ఫోన్ జులై 7వ తేదీ మధ్యాహ్నం 3:30 గంటలకు ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈరోజు ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ చిప్ సెట్ వివరాలు నథింగ్ వెల్లడించింది. కంపెనీ అఫీషియల్ ఎక్స్ అకౌంట్ మరియు ఫ్లిప్ కార్ట్ అందించిన ప్రత్యేకమైన టీజర్ పేజి నుంచి ఈ వివరాలు వెల్లడించింది.

Nothing Phone 4b: కీలక ఫీచర్స్

నథింగ్ ఫోన్ 4b డిజైన్ పరంగా సరికొత్త డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ స్లీక్ అండ్ స్టన్నింగ్ లుక్స్ తో ఉంటుంది. ఈ ఫోన్ CMF మరియు నథింగ్ లేటెస్ట్ 4a సిరీస్ ఫోన్ కలబోతగా కనిపిస్తుంది. ఈ ఫోన్ చాలా థిన్ అంచులు కలిగి ఎక్కువ స్క్రీన్ ను ఆఫర్ చేసే డిస్ప్లే కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే సెంటర్ పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను Snapdragon లేటెస్ట్ చిప్ సెట్ తో లాంచ్ చేయనున్నట్లు నథింగ్ తెలిపింది.

Nothing Phone 4b

ఈ ఫోన్ ను స్నాప్ డ్రాగన్ 6 జెన్ 4 చిప్ సెట్ తో లాంచ్ చేసే అవకాశం ఉందని ఇప్పటికే చాలా లీక్స్ చెబుతున్నాయి. ఇప్పుడు నథింగ్ రివీల్ చేసిన కొత్త అప్డేట్ చూస్తుంటే, ఇది నిజం అయ్యే అవకాశం ఉందని అనిపిస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.7 ఇంచ్ బిగ్ డిస్ప్లే కలిగి ఉంటుందని కూడా లీక్స్ చెబుతున్నాయి.

Also Read: రేపు లాంచ్ కాబోయే Samsung Galaxy M47 5G ఫోన్ పూర్తి ఫీచర్స్ ఈరోజే తెలుసుకోండి.!

ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ఫోన్ కెమెరాని పెద్ద బంప్ లో అందించింది. ఈ అప్ కమింగ్ ఫోన్ లో వెనుక 50MP మెయిన్ కెమెరా మరియు ముందు 32MP సెల్ఫీ కెమెరా ఉండే అవకాశం ఉన్నట్లు లీక్స్ చెబుతున్నాయి. కెమెరా బంప్ లో ఇండికేటర్ లైట్ మరియు రబ్బర్ మాదిరి డేట్స్ తో అందించింది. ఇప్పటి వరకు నథింగ్ అందించిన ఫోన్ లతో పోలిస్తే ఈ అప్ కమింగ్ ఫోన్ లో వాల్యూమ్ అండ్ పవర్ బటన్ కొంచెం పెద్దగా ఉంటుంది.

ఈ అప్ కమింగ్ నథింగ్ ఫోన్ మరిన్ని కీలక ఫీచర్లు కూడా కంపెనీ మెల్ల మెల్లగా విడుదల చేస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile