వన్ ప్లస్ 5G ఫోన్ పైన బిగ్ డీల్..చవక ధరకే ఫోన్ అందిస్తున్న అమెజాన్.!

HIGHLIGHTS

OnePlus Nord CE 2 Lite 5G పైన గొప్ప ఆఫర్లు

డిస్కౌంట్ ఆఫర్లతో చవక ధరకే అమెజాన్ ఆఫర్ చేస్తోంది

5G స్మార్ట్ ఫోన్ ను బడ్జెట్ ధరలో వస్తే కొనాలని చూస్తున్న వారికీ బెస్ట్ డీల్

అమెజాన్ ఇండియా ఈరోజు వన్ ప్లస్ 5G స్మార్ట్ ఫోన్ OnePlus Nord CE 2 Lite 5G పైన గొప్ప ఆఫర్లను అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఈరోజు అమెజాన్ నుండి బ్యాంక్ మరియు డిస్కౌంట్ ఆఫర్లతో చవక ధరకే అమెజాన్ ఆఫర్ల చేస్తోంది. వన్ ప్లస్ బ్రాండ్ యొక్క 5G స్మార్ట్ ఫోన్ ను బడ్జెట్ ధరలో వస్తే కొనాలని చూస్తున్న వారిలో మీరు కూడా ఉన్నట్లయితే, ఈ డీల్ పైన ఒక లుక్కేయండి. 

OnePlus Nord CE 2 Lite 5G: ధర & ఆఫర్లు

 5G స్మార్ట్ ఫోన్ ను బడ్జెట్ ధరలో వస్తే కొనాలని చూస్తున్న వారికీ ఈ బెస్ట్ డీల్ అమెజాన్ ఈరోజు అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను ప్రస్తుతం రూ. 18,999 రూపాయల అఫర్ ధర మరియు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI అప్షన్ తో కొనే వారికి 1,500 రూపాయల డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ బ్యాంక్ అఫర్ తో OnePlus Nord CE 2 Lite 5G స్మార్ట్ ఫోన్ రూ. 17,499 ధరకే పొందవచ్చు.

మీ వద్ద ప్రస్తుతం ఉన్న పాత ఫోన్ ను ఎక్స్ చేంజ్ చేసి కూడా ఈ ఫోన్ ను కొనుగోలు చేసే వీలుంది. మీ ఫోన్ మోడల్ ను బట్టి ఎక్స్ ఛేంజ్ దగర నిర్ణయించ బడుతుంది. Buy From Here 

OnePlus Nord CE 2 Lite 5G: టాప్ ఫీచర్లు

ఈ ఫోన్ లో డిస్ప్లే, ప్రోసెసర్, కెమేరా మరియు బ్యాటరీ లు టాప్ ఫీచర్స్ గా చెప్పవచ్చు. ఎందుకంటే, ఈ వన్ ప్లస్ బడ్జెట్ 5G లో 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన FHD+ బిగ్ డిస్ప్లే పంచ్ హోల్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ లో వన్ ప్లస్ స్నాప్ డ్రాగన్ 695 5G ప్రోసెసర్ మరియు 6GB ర్యామ్ / 128GB స్టోరేజ్ లను జత చేసింది. 

ఈ ఫోన్ లో 64 MP AI ట్రిపుల్ రియర్ కెమేరా మరియు 16MP Sony IMX471 సెల్ఫీ కెమేరా ఉన్నాయి. ఇందులో 33W  ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన హెవీ 5000 mAh బ్యాటరీ, లేటెస్ట్ ఆక్సిజన్ సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 12 OS తో పని చేస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :