iQOO Quest Days సేల్ నుంచి ఐకూ నియో 9 ప్రో డిస్కౌంట్ అందుకోండి.!

HIGHLIGHTS

iQOO Quest Days నిన్నటి నుంచి మొదలయ్యింది

ఈ సేల్ నుంచి iQOO Neo9 Pro 5G పై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది

ఈ సేల్ ఫిబ్రవరి 14వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది

iQOO Quest Days సేల్ నుంచి ఐకూ నియో 9 ప్రో డిస్కౌంట్ అందుకోండి.!

iQOO Quest Days నిన్నటి నుంచి మొదలయ్యింది. ఈ సేల్ నుంచి iQOO Neo9 Pro 5G స్మార్ట్ ఫోన్ పై అమెజాన్ ఇండియా భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఈ ఫోన్ ను ఈరోజు అన్ని ఆఫర్స్ తో కలిపి దాదాపు 8 వేల రూపాయల తక్కువ ధరకు అందుకునే అవకాశం వుంది. ప్రీమియం ఫీచర్స్ మరియు ఆకట్టుకునే డిజైన్ తో వచ్చిన ఈ ఫోన్ పై ఈరోజు అమెజాన్ అందించిన ఆఫర్స్ పై ఒక లుక్కేద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

iQOO Quest Days : అఫర్

ఐకూ క్వెస్ట్ డేస్ సేల్ నిన్నటి నుంచి ప్రారంభం అయ్యింది మరియు ఈ సేల్ ఫిబ్రవరి 14వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ నుంచి చాలా ఐకూ స్మార్ట్ ఫోన్స్ పై గొప్ప డీల్స్ అందించింది. అయితే ఐకూ నియో 9 ప్రో స్మార్ట్ ఫోన్ పై అందించిన ఆఫర్లు బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ ను ఎన్నడూ చూడనంత చవక ధరకు పొందవచ్చు.

iQOO Quest Days Deal

ఇక ఐకూ నియో 9 ప్రో స్మార్ట్ ఫోన్ పై అందించిన ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ రూ. 35,999 ధరతో లాంచ్ అవ్వగా, ఈరోజు రూ. 4,000 భారీ తగ్గింపు తో రూ. 31,999 ధరకి ఆఫర్ చేస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ పై రూ. 2,000 కూపన్ డిస్కౌంట్ మరియు ICICI మరియు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ పై రూ. 2,000 డిస్కౌంట్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ ను కేవలం రూ. 27,999 రూపాయల ఐ తక్కువ ధరకు పొందవచ్చు. Buy From Here

Also Read: Realme P3 Pro 5G: కొత్త గ్లో ఇన్ డార్క్ డిజైన్ మరియు ట్రిపుల్ డ్యూరబిలిటీతో వస్తోంది.!

iQOO Neo9 Pro 5G : ఫీచర్స్

ఐకూ నియో 9 ప్రో స్మార్ట్ ఫోన్ 3.2GHz క్లాక్ స్పీడ్ కలిగిన Snapdragon 8 Gen 2 చిప్ సెట్ ను కలిగి ఉంటుంది. దీనికి జతగా Q1 సూపర్ కంప్యూటింగ్ చిప్ సెట్, LPDDR5X 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో కూడా వస్తుంది. ఈ ఫోన్ ప్రీమియం లెథర్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ లో 6.78 ఇంచ్ LTPO AMOLED స్క్రీన్ ఉంటుంది. ఇది వేగవంతమైన గేమింగ్ కోసం తగిన 144Hz రిఫ్రెష్ రేట్ మరియు 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కూడా కలిగి ఉంటుంది.

ఇక ఈ ఫోన్ కెమెరా విషయానికి వస్తే, నైట్ విజన్ సపోర్ట్ కలిగిన 50MP Sony IMX920 మెయిన్ కెమెరా మరియు 8MP అల్ట్రా వైడ్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరాని 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 5160mAh బిగ్ బ్యాటరీని అల్ట్రా ఫాస్ట్ 120W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo