Realme P3 Pro 5G: కొత్త గ్లో ఇన్ డార్క్ డిజైన్ మరియు ట్రిపుల్ డ్యూరబిలిటీతో వస్తోంది.!
రియల్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ డిజైన్ వివరాలు ఈరోజు వెల్లడించింది
Realme P3 Pro 5G పూర్తి డిజైన్ మరియు ఇతర వివరాలు కూడా బయటపెట్టింది
రియల్ మీ పి3 ప్రో 5జి కంప్లీట్ వివరాలు తెలుసుకోండి
Realme P3 Pro 5G: రియల్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ డిజైన్ వివరాలు ఈరోజు వెల్లడించింది. ఈ ఫోన్ యొక్క ప్రోసెసర్ తో ముందుగా టీజింగ్ మొదలు పెట్టిన రియల్ మీ, ఇప్పుడు పూర్తి డిజైన్ మరియు ఇతర వివరాలు కూడా బయటపెట్టింది. రియల్ మీ పి3 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ ఇప్పటి వరకు వెల్లడించిన కంప్లీట్ వివరాలు తెలుసుకోండి.
SurveyRealme P3 Pro 5G : లాంచ్
రియల్ మీ పి 3 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరి 18వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ కోసం రియల్ మీ అందించిన టీజర్ పేజి నుంచి ఈ ఫోన్ యొక్క కీలకమైన వివరాలు కూడా అందించింది.
Realme P3 Pro 5G : ఫీచర్స్
రియల్ మీ పి 3 ప్రో స్మార్ట్ ఫోన్ ను కొత్త గ్లో ఇన్ డార్క్ డిజైన్ తో లాంచ్ చేస్తున్నట్లు రియల్ మీ కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ ను కాస్మోస్ ప్రేరేపిత యూనిక్ నెబ్యులా ప్యాట్రన్ కలిగిన డిజైన్ తో ఈ ఫోన్ ను అందించింది. వెలుగు లేనప్పుడు ఈ ఫోన్ మీరు మిట్లు గొలుపుతుంది. ఇది కాకుండా ఈ ఫోన్ యొక్క లెథర్ బ్యాక్ వేరియంట్ కూడా ఉన్నట్లు టీజర్ ఇమేజ్ ద్వారా కన్ఫర్మ్ అయ్యింది.

ఈ ఫోన్ లో వెనుక OIS 50MP డ్యూయల్ రియర్ కెమెరా వుంది. ఈ ఫోన్ కేవలం 7.99mm మందంతో చాలా స్లీక్ ఉంటుందని రియల్ ఎల్ మీ తెలిపింది. ఈ ఫోన్ 1.5K రిజల్యూషన్ మరియు గరిష్ఠమైన బ్రైట్నెస్ కలిగిన స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Snapdragon 7s Gen 3 చిప్ సెట్ తో లాంచ్ అవుతుంది. రియల్ మీ పి 3 ప్రో 6000 mAh బిగ్ బ్యాటరీ మరియు 80W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది.
Also Read: 25 వేల బడ్జెట్ లో 50 ఇంచ్ Smart Tv డీల్స్ సెర్చ్ చేస్తున్నారా.. ఒక లుక్కేయండి.!
ఈ అప్ కమింగ్ రియల్ మీ స్మార్ట్ ఫోన్ ట్రిపుల్ IP రేటెడ్ డ్యూరబిలిటీ కలిగి ఉంటుంది. అంటే, ఈ ఫోన్ IP66, IP68 మరియు IP69 రేటింగ్ తో పటిష్టంగా మరియు డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా కూడా ఉంటుంది. ఈ ఫోన్ ను అత్యంత వేగంగా చల్లబరిచే వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టం ఉన్నట్లు కూడా రియల్ మీ తెలిపింది.