Motorola razr 50 పై అమెజాన్ భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుకోండి.!
Motorola razr 50 స్మార్ట్ ఫోన్ పై అమెజాన్ ఈరోజు భారీ డీల్స్ అందించింది. ఇండియన్ మార్కెట్ లో ఇటీవల విడుదలైన ఈ ఫ్లిప్ ఫోన్ ఈరోజు తక్కువ ధరకు లభిస్తుంది. అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్ నుంచి ఈ ఫోన్ పై భారీ డీల్స్ అందించింది. అందుకే, ఈరోజు ఈ మోటోరోలా ప్రీమియం ఫ్లిప్ ఫోన్ మంచి ఆకట్టుకునే ధరకు లభిస్తుంది.
Motorola razr 50 : ఆఫర్
మోటోరోలా రేజర్ 50 స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 64,999 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. అయితే ఈ ఫోన్ ఈరోజు అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్ నుంచి రూ. 10,000 భారీ డిస్కౌంట్ తో రూ. 54,998 రూపాయల ఆఫర్ ధరకు సేల్ అవుతోంది.
మోటోరోలా రేజర్ 50 పై కేవలం డిస్కౌంట్ ఆఫర్ మాత్రమే కాదు రూ. 5,000 రూపాయల భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది. ఈ ఫోన్ ను Axis మరియు IDFC First క్ర్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి ఈ రూ. 5,000 రూపాయల తగ్గింపు లభిస్తుంది. అంటే, ఈ రెండు డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ రూ. 49,998 రూపాయల ఆఫర్ ధరకు పొందవచ్చు.
Also Read: QLED Smart Tv Deal: భారీ డిస్కౌంట్ తో 16 వేలకే లభిస్తున్న 43 ఇంచ్ 4K టీవీ.!
Motorola razr 50 : ఫీచర్స్
ఈ మోటోరోలా ఫ్లిప్ ఫోన్ రెండు స్క్రీన్ లను కలిగి ఉంటుంది. ఇందులో 3.6 AMOLED బయట స్క్రీన్ మరియు మడతపెట్టే 6.9 ఇంచ్ AMOLED మెయిన్ స్క్రీన్ ఉంటాయి. ఈ ఫోన్ Mediatek Dimensity 7300X 5G చిప్ సెట్ తో పని చేస్తుంది. ఇందులో 8GB ఫిజికల్ ర్యామ్, 8GB ర్యామ్ బూస్ట్ ఫీచర్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటాయి.
ఈ ఫోన్ లో వెనుక 50MP + 13MP క్వాడ్ పిక్సెల్ రియర్ మరియు 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ 4K వీడియో షూట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ ఫోన్ IP68 వాటర్ రెసిస్టెంట్ మరియు డస్ట్ ప్రూఫ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 4200mAh బిగ్ బ్యాటరీ మరియు 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ఉన్నాయి.