Realme GT 7 Pro పై భారీ ధర తగ్గింపు అందించిన అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.!

HIGHLIGHTS

Realme GT 7 Pro స్మార్ట్ ఫోన్ గత ఏడాది భారీ ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది

ఈ ప్రీమియం స్మార్ట్ ఫోన్ పై ఈరోజు అమెజాన్ భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది

అమెజాన్ అందించిన గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుంచి ఈ బిగ్ డీల్స్ అనౌన్స్ చేసింది

Realme GT 7 Pro స్మార్ట్ ఫోన్ గత ఏడాది భారీ ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది. అటువంటి ఈ ప్రీమియం స్మార్ట్ ఫోన్ పై ఈరోజు అమెజాన్ భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. అమెజాన్ అందించిన గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుంచి ఈ బిగ్ డీల్స్ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ పై అమెజాన్ ఆఫర్ చేస్తున్న డీల్స్ మరియు ఈ ఫోన్ ఫి ఫీచర్స్ తెలుసుకోండి.

Realme GT 7 Pro: అమెజాన్ ఆఫర్స్

గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 నుంచి రియల్ మీ జిటి 7 ప్రో ఫోన్ పై అమెజాన్ భారీ తగ్గింపు ప్రకటించింది. ఈ ఫోన్ లాంచ్ ధర రూ. 59,999 గా ఉండగా, ఈరోజు అమెజాన్ సేల్ నుంచి ఈ ఫోన్‌ను కేవలం రూ. 49,998 ప్రైస్ తో సేల్ చేస్తోంది. అంటే, ఈ ఫోన్ పై అమెజాన్ ఈరోజు రూ. 10,001 తగ్గింపు అందించింది.

ఈ భారీ డిస్కౌంట్‌ తో పాటు అదనంగా SBI క్రెడిట్ కార్డు డిస్కౌంట్ కూడా అందించింది. ఈ ఫోన్ ను ఈ కార్డు ఉపయోగించి తీసుకుంటే మరో రూ. 1,000 అదనపు తగ్గింపు కూడా పొందవచ్చు. ఇదేకాదు, ఈ ఫోన్ ను No-Cost EMI ఆప్షన్లతో కూడా మీ బడ్జెట్‌కు అనుగుణంగా నెలవారీ చెల్లింపుల ద్వారా కొనుగోలు చెయ్యచ్చు. అంతేకాదు, మీ పాత ఫోన్‌ తో ఎక్స్‌చేంజ్ చేస్తే మీకు ఎక్స్ చేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. ఈ అన్ని ఆఫర్స్ తో ఈ ఫోన్ గొప్ప డిస్కౌంట్ ధరలో మీకు లభిస్తుంది. Buy From Here

Also Read: BSNL Spark Plan: కేవలం రూ. 399 ఖర్చుతో నెలకు 3300 GB డేటా అందుకోండి.!

Realme GT 7 Pro: ఫీచర్స్

ఈ ఫోన్ శక్తివంతమైన ఫీచర్స్ మరియు స్పెక్స్ తో ఆకట్టుకుంటుంది. ఇందులో 6.78 ఇంచ్ FHD+ AMOLED డిస్‌ప్లే ఉంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 6500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ తో వస్తుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ యొక్క అత్యంత పవర్ ఫుల్ చిప్ సెట్ Snapdragon 8 Elite 5G ను కలిగి ఉంది. ఇది సూపర్ పెర్ఫార్మెన్స్ మరియు గొప్ప గేమింగ్ సామర్థ్యాన్ని అందిస్తుంది.

కెమెరా పరంగా, ఇందులో 50 MP ప్రధాన సెన్సార్, 50 MP టెలిఫోటో (3x ఆప్టికల్ జూమ్) సెన్సార్ మరియు 8 MP అల్ట్రా వైడ్ సెన్సార్ కలిగిన ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉంది. అంతేకాదు, 16MP సెల్ఫీ కెమెరా కూడా ఈ ఫోన్ లో ఉంది. ఇది గొప్ప 4K వీడియో రికార్డింగ్ మరియు ఉన్నతమైన AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 5800 mAh బ్యాటరీ మరియు 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :