Amazon GIF Sale: iPhone 13 పైన కళ్ళు చెదిరే భారీ డిస్కౌంట్ ప్రకటించిన అమేజాన్

HIGHLIGHTS

Amazon GIF Sale కోసం Prime Members కి యాక్సెస్ అందించింది

Apple iPhone 13 ఫోన్ పైన కళ్ళు చెదిరే భారీ డిస్కౌంట్ ను అమేజాన్ ప్రకటించింది

ఈ సేల్ అఫర్ దెబ్బకి యాపిల్ ఐఫోన్ 13 ఎన్నడూ చూడనంత చవక ధరకే లభిస్తోంది

Amazon GIF Sale కోసం Prime Members కి యాక్సెస్ అందించింది అమేజాన్. ఎప్పటిలాగానే అమేజాన్ ప్రైమ్ మెంబర్స్ అందరి కంటే ఒక్కరోజు ముందగానే అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి అందించే గొప్ప డీల్స్ ను అందుకున్నారు. ఇంతకంటే గ్రేట్ న్యూస్ ఏమిటంటే ఈ సేల్ నుండి Apple iPhone 13 ఫోన్ పైన కళ్ళు చెదిరే భారీ డిస్కౌంట్ ను అమేజాన్ ప్రకటించింది. ఈ సేల్ అఫర్ దెబ్బకి యాపిల్ ఐఫోన్ 13 ఎన్నడూ చూడనంత చవక ధరకే లభిస్తోంది.

Amazon GIF Sale

అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి ఐఫోన్ 13 ఫోన్ ను 34% భారీ డిస్కౌంట్ తో రూ. 45,999 రూపాయల అఫర్ ధరకే అమేజాన్ సేల్ చేస్తోంది. ఈ భారీ డిస్కౌంట్ తో పాటుగా ఎంపిక చేసిన స్మార్ట్ ఫోన్స్ తో ఎక్స్ ఛేంజ్ చేసే వారికి రూ. 3,500 రూపాయల అదనపు బోనస్ ను కూడా ఇస్తోంది. ఇది మాత్రమే కాదు, ఈ ఫోన్ ను SBI కార్డ్స్ తో కొనేవారికి రూ. 1,500 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ను కూడా అందిస్తోంది.

అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఐఫోన్ 13 ఆఫర్

అంటే, ఈ అన్ని ఆఫర్లను అందిపుచ్చుకుంటే ఐఫోన్ 13 ఫోన్ ను కేవలం రూ. 39,999 రుపాయలకే మీ సొంతం చేసుకోవచ్చు. మరింకెందుకు ఆలశ్యం ఆఫర్ ధరలతో ఐఫోన్ 13 ను కొనడానికి Click Here to Buy

Also Read : Gold Rate: ఈరోజు గోల్డ్ మార్కెట్ అప్డేట్ ఎలా ఉందంటే | New Update

ఐఫోన్ 13 ప్రత్యేకతలు

ఐఫోన్ 13 స్మార్ట్ ఫోన్ 6.1-ఇంచ్ పరిమాణం కలిగిన Super Retina XDR డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ డిస్ప్లే గొప్ప విజువల్స్ ను అంధిస్తుంది మరియు ఈ ఫోన్ ను చాలా మన్నికైన సిరామిక్ షీల్డ్ తో అందించింది యాపిల్. A15 Bionic Chip తో ఈ ఐఫోన్ 13 వస్తుంది మరియు 30 నిముషాలు నీటిని తట్టుకోగల వాటర్ రెసిస్టెంట్ (Rated IP68) గా ఉంటుంది.

ఇక ఐఫోన్ 13 కెమేరాల విషయానికి వస్తే, ఇందులో 12MP + 12MP డ్యూయల్ కెమేరా సెటప్ మరియు 12MP సెల్ఫీ కెమేరా కూడా వుంది. ఈ ఫోన్ కెమేరాతో అద్భుతమైన ఫోటోలను మరియు 60fps వద్ద 4K Dolby Vision HDR వీడియోలను రికార్డ్ చేసే వీలుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో ఉన్న Cinematic mode తో ఆటో ఫోకస్ షిఫ్ట్ తో వీడియోలను చిత్రీకరించవచ్చు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :