amazon announced rs 20000 big discount on Samsung Galaxy S26 Ultra 5G
Samsung Galaxy S26 Ultra 5G : శామ్సంగ్ లేటెస్ట్ ప్రీమియం ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం మార్కెట్లో ఆకర్షణీయమైన ఆఫర్ తో అందుబాటులో ఉంది. అత్యాధునిక కెమెరా సెటప్, శక్తివంతమైన ప్రాసెసర్, గొప్ప గెలాక్సీ AI ఫీచర్లు మరియు ప్రీమియం డిజైన్ తో వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం రూ.20,000 వరకు భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతోంది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 26 అల్ట్రా 5జి స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 1,39,999 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. అయితే, అమెజాన్ ఇండియా నుంచి ఈరోజు దాదాపు 20 వేల రూపాయల భారీ డిస్కౌంట్ తో రూ. 1,20,990 రూపాయల ఆఫర్ ధరలో సేల్ అవుతుంది. ఇవి కాకుండా ఈ స్మార్ట్ ఫోన్ పై భారీ క్యాష్ బ్యాక్ మరియు నో కాస్ట్ ఈఎంఐ వంటి ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ ను గొప్ప డిస్కౌంట్ ధరలో పొందాలని చూసే వారికి ఇదే సరైన సమయం అవుతుంది. Buy From Here
ఫోటోగ్రఫీ ప్రియులను ఆకట్టుకునే 200MP ప్రధాన కెమెరా, అద్భుతమైన AMOLED డిస్‌ప్లే, S Pen సపోర్ట్ మరియు ఫ్లాగ్ షిప్ స్థాయి పెర్ఫార్మెన్స్ తో గెలాక్సీ S26 అల్ట్రా 5G స్మార్ట్ ఫోన్ ఇప్పటికే ప్రీమియం స్మార్ట్ ఫోన్ విభాగంలో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇప్పుడు ఈ ఫోన్ పై అందుబాటులో ఉన్న భారీ ధర తగ్గింపు కారణంగా కొనుగోలుదారులకు ఇది మరింత ఆకర్షణీయమైన డీల్ గా ఉంటుంది.
Also Read: Realme P4R 5G: రియల్‌మీ అప్ కమింగ్ ఫోన్ టాప్ ఫీచర్స్ ఇవే.!
ఇక ఈ ఫోన్ ప్రీమియం ఆన్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ శామ్సంగ్ ఫోన్ 6.9 అంగుళాల Dynamic AMOLED 2X QHD+ డిస్‌ప్లే ని 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్ మరియు అత్యధిక బ్రైట్ నెస్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్ తో పని చేస్తుంది. ఇది 12GB/16GB RAM మరియు 256GB, 512GB, 1TB స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.
ఈ ఫోన్ గెలాక్సీ AI ఆధారిత ఫీచర్లు, S Pen సపోర్ట్, IP 68 వాటర్ మరియు డస్ట్ రెసిస్టెన్స్ వంటి ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది. అంతేకాదు, అల్ట్రాసోనిక్ ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి లేటెస్ట్ ఫీచర్లు కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీతో పాటు 60W ఫాస్ట్ ఛార్జింగ్, వైర్ లెస్ ఛార్జింగ్ మరియు రివర్స్ వైర్ లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
ఇక ప్రధాన ఫీచర్డ్ అయిన కెమెరా విభాగానికి వస్తే, శామ్సంగ్ ఈ ఫోన్ లో అత్యంత శక్తివంతమైన కెమెరా సెటప్ ను అందించింది. ఇందులో 200MP ప్రధాన కెమెరా, 50MP అల్ట్రా వైడ్ కెమెరా, 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా మరియు 10MP టెలిఫోటో సెన్సార్ భారీ సెటప్ ఉంది. ఈ ఫోన్ 8K వీడియో రికార్డింగ్, AI ఫోటోగ్రఫీ టూల్స్, నైట్ మోడ్ మరియు అడ్వాన్స్‌డ్ జూమ్ సామర్ధ్యం కలిగి ఉంటుంది. సెల్ఫీల కోసం 12MP ఫ్రంట్ కెమెరా ఈ ఫోన్ లో ఉంటుంది.