స్టైలస్ పెన్ తో Alcatel V3 ultra 5G లాంచ్ కన్ఫర్మ్ చేసిన ఆల్కాటెల్.!
ఇండియన్ మార్కెట్లో సాలిడ్ కమ్ బ్యాక్ కోసం Alcatel పూర్తి ప్లానింగ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది
అప్ కమింగ్ ఫోన్ కోసం విలక్షణమైన టీజింగ్ కూడా చేస్తోంది
Alcatel V3 ultra 5G యొక్క వివరాలు ఒక్కొక్కటిగా వెల్లడిస్తోంది
ఇండియన్ మార్కెట్లో సాలిడ్ కమ్ బ్యాక్ కోసం Alcatel పూర్తి ప్లానింగ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ టీజర్ తో బిజీ అయ్యింది మరియు అప్ కమింగ్ ఫోన్ కోసం విలక్షణమైన టీజింగ్ కూడా చేస్తోంది. ఈ ఫోన్ యొక్క కొత్త టీజర్ ద్వారా ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క వివరాలు ఒక్కొక్కటిగా వెల్లడిస్తోంది.
Alcatel V3 ultra 5G : లాంచ్
కొత్త ఫోన్ లను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేస్తున్నట్లు ఆల్కాటెల్ ప్రకటించింది. అయితే, ఈ ఫోన్ లాంచ్ డేట్ మాత్రమే కంపెనీ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. కానీ, ఈ ఫోన్ కీలకమైన ఫీచర్స్ తో టీజింగ్ చేస్తోంది. అంతేకాదు, NxtQuantum షిఫ్ట్ టెక్నాలజీస్ ఫౌండర్ & CEO మాధవ్ సేథ్ తన అధికారిక X అకౌంట్ నుంచి ఈ అప్ కమింగ్ ఫోన్ ఇమేజ్ తో టీజింగ్ చేశారు. ఇందులో ఈ ఫోన్ యొక్క వివరాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి.
Alcatel V3 ultra 5G : ఫీచర్స్
ఆల్కాటెల్ వి3 అల్ట్రా 5జి స్మార్ట్ ఫోన్ టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ ను స్టైలస్ పెన్ తో లాంచ్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది. ఈ అప్ కమింగ్ ఫోన్ యొక్క బాక్స్ ఇమేజ్ తో సేథ్ టీజింగ్ చేశారు. ఇందులో ఈ ఫోన్ యొక్క డిజైన్ మరియు స్టైలస్ పెన్ వివరాలు వెల్లడయ్యాయి. ఇందులో వెనుక గొప్ప కెమెరా ఉన్నట్లు కూడా వెల్లడయ్యింది.
ఆల్కాటెల్ వి3 అల్ట్రా 5జి స్మార్ట్ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా ఉంది. ఈ కెమెరా సెటప్ ను పెద్ద రౌండ్ బంప్ లో అందించింది. ఈ కెమెరా సెటప్ లో పెద్ద అల్ట్రా పిక్సెల్స్ అందించే లేటెస్ట్ సెన్సార్ ఉందని కూడా కంపెనీ టీజర్ ద్వారా వెల్లడించింది.
ఇక ఈరోజు కంపెనీ X హ్యాండిల్ నుంచి అందించిన కొత్త టీజర్ పోస్ట్ ద్వారా ఈ ఫోన్ యొక్క కెమెరా వివరాలు క్లియర్ గా కనిపించేలా చేసింది. ఇందులో ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా ఉన్నట్లు నిర్ధారించారు. ఈ ఫోన్ లో చాలా సన్నని అంచులు కలిగిన స్క్రీన్ ఉన్నట్లు కూడా చూపించింది. ఇవి కాకుండా ఈ ఫోన్ లో అందించిన స్క్రీన్ చాలా ఆకర్షణీయమైన డెడికేటెడ్ మోడ్స్ కలిగి ఉంటుందని కూడా కంపెనీ వెల్లడించింది.
Also Read: భారీ డిస్కౌంట్ తో 23 వేలకే లభిస్తున్న 55 ఇంచ్ LG ThinQ AI సపోర్టెడ్ Smart Tv.!
ఇవన్నీ చూస్తుంటే, ఇండియన్ మార్కెట్లో ప్రస్తుతం నడుస్తున్న చాలా స్మార్ట్ ఫోన్ లను లక్ష్యంగా చేసుకొని ఆల్కాటెల్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లను లాంచ్ చేయడానికి చూస్తున్నట్లు అర్ధం అవుతోంది.