Pulse 2: అతి చవక ధరలో 6000 mAh బిగ్ బ్యాటరీ ఫోన్ లాంచ్ అయ్యింది.!

HIGHLIGHTS

AI+ ఈరోజు ఇండియాలో పల్స్ 2 స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది

అతి చవక ధరలో 6000 mAh బిగ్ బ్యాటరీ తో అందించింది

అండర్ రూ. 6,000 బడ్జెట్ యూజర్ ను దృష్టిలో ఉంచుకుని ఈ ఫోన్ ను అందించింది

Pulse 2: మాధవ్ సేత్ నేతృత్వం లోని మొబైల్ తయారీ కంపెనీ AI+ ఈరోజు ఇండియాలో పల్స్ 2 స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను అతి చవక ధరలో 6000 mAh బిగ్ బ్యాటరీ మరియు 50MP డ్యూయల్ కెమెరా వంటి మరిన్ని ఆకట్టుకునే ఫీచర్స్ తో అందించింది. అండర్ రూ. 6,000 బడ్జెట్ యూజర్ ను దృష్టిలో ఉంచుకుని ఈ ఫోన్ ను అందించింది.

Pulse 2: ప్రైస్

ఏఐ ప్లస్ ఈ ఫోన్ ను రెండు వేరియంట్లలో అందించింది. ఈ ఫోన్ బేసిక్ (4 జీబీ + 64 జీబీ) వేరియంట్ ను రూ. 5,999 రూపాయల ధరలో ఈ ఫోన్ హై ఎండ్ (6 జీబీ + 128 జీబీ) వేరియంట్ ను రూ. 7,999 రూపాయల ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ బ్లాక్, బ్లూ, గ్రీన్, పింక్ మరియు పర్పల్ తో మొత్తం ఐదు రంగుల్లో లభిస్తుంది. మార్చి 11వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ సేల్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ కి అందుబాటులోకి తీసుకొస్తుంది.

Also Read: iQOO Z11x 5G ఇండియా లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ కన్ఫర్మ్ చేసిన ఐకూ.!

Pulse 2: ఫీచర్స్

ఈ స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచ్ HD+ (720×1600) LCD స్క్రీన్ కలిగి ఉంటుంది. ఇది మంచి 120Hz రిఫ్రెష్ రేట్ మరియు బ్రైట్నెస్ తో కూడా ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ Unisoc T7250 ఆక్టా కోర్ చిప్ సెట్ తో లాంచ్ అయ్యింది మరియు రోజు వారి అవసరాలకు సరిపోయే పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ చిప్ సెట్ కి జతగా 6 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది. మైక్రో SD కార్డు తో ఈ ఫోన్ మెమొరీని 1TB వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్ NxtQ OS సాఫ్ట్ వేర్ తో లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 OS పై నడుస్తుంది.

ఈ ఫోన్ 50MP AI డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కలిగిన మెయిన్ కెమెరా FHD వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది మరియు మంచి కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ స్లీక్ డిజైన్ లో కూడా 6000 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో మంచి సౌండ్ అందించే సింగల్ స్పీకర్ మరియు 10W చార్జర్ తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :