Acer Super ZX 5G: ఏసర్ ఇటీవల విడుదల చేసిన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఏసర్ సూపర్ Zx 5జి ఇప్పుడు మంచి డిస్కౌంట్ ఆఫర్ తో సహా సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ 10 వేల రూపాయల బడ్జెట్ దగరలో వచ్చింది. అయితే, అమెజాన్ ఈ ఫోన్ పై అందించిన కూపన్ డిస్కౌంట్ ఆఫర్ తో మరింత చవక ధరకు లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 64MP Sony కెమెరా మరియు గొప్ప డిజైన్ తో వస్తుంది.
Survey
✅ Thank you for completing the survey!
Acer Super ZX 5G: ప్రైస్ మరియు ఆఫర్లు
ఏసర్ సూపర్ Zx 5జి స్మార్ట్ ఫోన్ మూడు విభిన్నమైన ఎంపికలో లభిస్తుంది. ఏసర్ సూపర్ Zx 5జి (4GB, 128GB) ఫోన్ ను రూ. 9,999 ధరతో, (6GB, 128GB) ఫోన్ రూ. 10,999 ధరతో మరియు (6GB, 128GB) ఫోన్ ను రూ. 11,999 ధరతో లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ ఫోన్ అమెజాన్ నుండి రూ. 1,000 కూపన్ డిస్కౌంట్ ఆఫర్ తో సేల్ అవుతోంది.
ఈ ఆఫర్ తో ఈ ఫోన్ అన్ని వేరియంట్స్ పై రూ. 1,000 అదనపు తగ్గింపు పొందవచ్చు. ఈ ఫోన్ కార్బన్ బ్లాక్, కాస్మిక్ గ్రీన్ మరియు లునార్ బ్లూ మూడు రంగుల్లో లభిస్తుంది.
ఏసర్ సూపర్ Zx 5జి స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 6300 5G చిప్ సెట్ తో నడుస్తుంది మరియు ఇందులో 4 జీబీ / 6 జీబీ / 8జీబీ ర్యామ్ సపోర్ట్ మరియు 128 జీబీ అంతర్గత మెమరీ ఉంటుంది. ఈ ఫోన్ 8.6mm మందం మరియు వెనుక పెద్ద రౌండ్ కెమెరా బంప్ తో ఉంటుంది. ఈ ఫోన్ 6.78 ఇంచ్ LCD డిస్ప్లే కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ మరియు FHD+ రిజల్యూషన్ కలిగి ఉంటుంది.
ఈ ఏసర్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. ఈ కెమెరా సెటప్ లో 64MP Sony మెయిన్ కెమెరా, డెప్త్ లెన్స్ మరియు మ్యాక్రో లెన్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 13MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ 2K వీడియో రికార్డ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 5000 mAh బిగ్ బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో వస్తుంది.