Samsung Galaxy S24 Ultra 5G స్మార్ట్ ఫోన్ పై అమెజాన్ ఈరోజు లిమిటెడ్ పీరియడ్ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. శామ్సంగ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ సిరీస్ యొక్క ఫ్లాగ్ షిప్ ఫోన్ ను ఈరోజు డిస్కౌంట్ ధరకే అందుకోవచ్చని అమెజాన్ తెలిపింది. అంతేకాదు, ఇది ఇండియాలో నెంబర్ వన్ సెల్లింగ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ గా ప్రతిష్ట పొందునట్లు కూడా అమెజాన్ గుర్తు చేసింది.
Survey
✅ Thank you for completing the survey!
Samsung Galaxy S24 Ultra 5G : ఆఫర్
శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా ఇండియాలో రూ. 1,29,999 ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. అయితే, అమెజాన్ ఇండియా ఈరోజు శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా ఫోన్ ను రూ. 45,000 భారీ డిస్కౌంట్ తో రూ. 84,999 డిస్కౌంట్ ప్రైస్ తో సేల్ చేస్తోంది. ఈ ఫోన్ పై అందించిన డిస్కౌంట్ ఆఫర్ కేవలం లిమిటెడ్ పీరియడ్ డిస్కౌంట్ ఆఫర్ మాత్రమే అని చెప్పింది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ పై మరో రెండు ఆఫర్లు కూడా అందించింది.
ఈ ఫోన్ ను No Cost EMI ఆఫర్ తో కొనే వారికి దాదాపు 7 వేల రూపాయల వరకు వడ్డీ ఆదా చేసుకునే అవకాశం అందించింది. ఈ ఫోన్ ను Amazon Pay ICICI Bank క్రెడిట్ కార్డ్ తో కొనే వారికి 5% క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఈ ఆఫర్ ను అమెజాన్ నుంచి చెక్ చేయడానికి Check Offer పై నొక్కండి.
శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా స్మార్ట్ ఫోన్ టైటానియం ఎక్స్టీరియర్ మరియు 6.8 ఇంచ్ ఫ్లాట్ డిస్ప్లే తో మనసు దోచుకునే సుందరమైన డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ QHD+ Dynamic AMOLED 2X, 120Hz రిఫ్రెష్ రేట్, 2600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు S పెన్ ఇంటిగ్రేషన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కేవలం చూడటానికే ప్రీమియం కాదు పెర్ఫార్మెన్స్ కూడా ప్రీమియం గానే ఉంటుంది. ఎందుకంటే, ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 8 Gen 3 చిప్ సెట్ మరియు జతగా 12GB ఫాస్ట్ ర్యామ్ తో పాటు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ ప్రీమియం లో ప్రీమియం కెమెరా సెటప్ కూడా ఉంది. ఇందులో 200MP ప్రధాన, 50MP పెరిస్కోప్, 10MP టెలిఫోటో మరియు 12MP అల్ట్రా వైడ్ సెన్సార్ లతో క్వాడ్ కోర్ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 30FPS తో 8K వీడియో, 120FPS తో 4K వీడియోలు HDR10+ సపోర్ట్ తో చిత్రించే సత్తా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 12MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది.
ఈ శామ్సంగ్ ఫోన్ 5,000mAh బ్యాటరీ కలిగి ఉంటుంది. ఇందులో 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్, 15W మరియు రివర్స్ వైర్లెస్ ఛార్జ్ వంటి ఛార్జింగ్ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP68 రేటింగ్ తో వాటర్ మరియు డస్ట్ రెసిస్టెంట్ గా కూడా ఉంటుంది.