గూగుల్ మరియు ఫేస్ బుక్ ని మోసం చేసి, ఏకంగా 842 కోట్లు దోచుకున్నవ్వక్తి

గూగుల్ మరియు ఫేస్ బుక్ ని మోసం చేసి, ఏకంగా 842 కోట్లు దోచుకున్నవ్వక్తి
HIGHLIGHTS

నకిలీ ఇన్వాయిసులను ఇవ్వడం ద్వారా ఈ కార్పొరేట్ సంస్థలను మోసం చేశాడు.

ఒక లిథువేనియన్ వ్వక్తి,  ప్రపంచంలోని అతిపెద్ద కార్పొరేట్ సంస్థలైన గూగుల్ మరియు ఫేస్ బుక్ లను నకిలీ బిల్లులతో మోసగించాడు- నకిలీ ఇన్వాయిస్లను అందించడం ద్వారా ఈ కంపెనీలు ఎటువంటి సందేహం లేకుండా, డబ్బును  చెల్లించాయి. లిథువేనియా యొక్క ఎవాల్దాస్ రిమాసౌస్కాస్, ఫేస్ బుక్ ని 99 మిలియన్ డాలర్లకు మరియు గూగుల్ ని $ 23 మిలియన్ డాలర్లకు, 2013 మరియు 2015 మధ్యకాలంలో ఏమార్చాడు, ఈ సంస్థలకు నకిలీ ఇన్వాయిసులను  నకిలీ వ్రాతపూర్వక పత్రాలు మరియు కార్పొరేట్ అధికారుల నుండి ఇమెయిల్స్ ద్వారా పంపించడం ద్వారా ఈ మోసాన్ని చేయగలిగాడు. ఆశ్చర్యమైన విషయంమేమిటంటే,  ఈ ఇన్వాయిసులలో చూపించిన సామానులను సదరు సంస్థలు అసలు ఎటువంటి ఆర్డర్ కూడా చేయలేదు.      

రిమాసౌస్కాస్ తన కాంట్రాక్ట్ ని చట్టబద్ధమైనదిగా చూపించేలా చేయడానికి, కంపెనీ అధికారులు మరియు ఇతర పత్రాల నుండి తప్పుడు ఒప్పందాలు, నకిలీ లెటర్లను తయారు  కూడా చేశాడు. అతను క్వాంటా కంప్యూటర్ ఇంక్ అని పిలువబడే తైవానీస్ హార్డ్వేర్ తయారీదారు నుండి విక్రయదారుడిగా మోసం చేశాడు. అంతేకాదు, ఈ విషయాన్ని అందరిని నమ్మించడం కోసం, లాట్వియాలో అదే పేరుతో ఒక కంపెనీని కూడా నమోదు చేశాడు. ఫేస్ బుక్ లేదా గూగుల్ నుండి  ఎవరూ కూడా అతని మిలియన్ డాలర్ల  పత్రాలను పరిశీలించలేదు. అంతేకాదు, అతను లితువానియా, హంగరీ, స్లొవేకియా, సైప్రస్ మరియు లాట్వియాలో అనేక బ్యాంకు ఖాతాల ద్వారా ఈ అమౌంటును అందుకున్నాడు.

చివరికి, Google ఈ విషయాన్ని ఒక వరం క్రితం కనుగొన్నది. ఇది, రిమాసౌస్కాస్ US వైర్ ఫ్రాడ్, తీవ్రమైన ఐడెంటిటీ దొంగిలింపు, మరియు మనీ లాండరింగ్  ఆరోపణ నేరాన్ని అంగికరించిన తరువాత జరిగింది. అతను ఇప్పుడు $50 మిలియన్ల (345 కోట్ల) అపహరణకు తనే కర్త అని అంగీకరించాడు, కానీ మిగిలిన $ 73  (497 కోట్లు) మిలియన్లకు ఏమయ్యాయి అనే విషయం అస్పష్టంగా ఉంది.

రిమాసౌస్కాస్ కి ఈ జూలై 29 న శిక్ష ఉంటుంది మరియు అతను ఈ స్కామ్ కోసం 30 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిచాల్సివుంటుంది. ఈ విషయంపై వ్యాఖ్యానిస్తూ, గూగుల్ ఇలా చెప్పింది, "మేము ఈ మోసాన్ని కనుగొన్నాము మరియు వెంటనే అధికారులను హెచ్చరించాము. మేము ఫండింగ్ ను తిరిగి పొందాము మరియు మేము ఈ విషయాన్ని పరిష్కరించామని తెలుపడానికి సంతోషిస్తున్నాము ", అని చెప్పింది.  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo