నమ్మశక్యం కానీ అఫర్!! లేటెస్ట్ LG స్మార్ట్ ఫోన్ పైన Rs.50,000 డిస్కౌంట్
Rs.50,001 రూపాయల డిస్కౌంట్
Flipkart ఫ్లాగ్ షిప్ ఫెస్ట్ సేల్ నుండి అఫర్
నమ్మశక్యం కానీ అఫర్
Flipkart నుండి LG Wing స్మార్ట్ ఫోన్ నమ్మశక్యం కానీ విధంగా Rs.50,001 రూపాయల డిస్కౌంట్ తో అమ్ముడవుతోంది. ఇటీవల LG ప్రపంచ వ్యాప్తంగా తన మొబైల్ బిజినెస్ ను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన తరువాత Flipkart ప్రకటించిన ఫ్లాగ్ షిప్ ఫెస్ట్ సేల్ నుండి ఈ ఫోన్ అఫర్ ధరను అందుకుంది. అలాగని ఈ ఫోన్ ప్రతిరోజూ అందుబాటులో ఉండదు. ఏప్రిల్ 12 నుండి 15 వరకూ జరగనున్న ఫ్లిప్‌కార్ట్ ఫ్లాగ్ షిప్ ఫెస్ట్ సేల్ మాత్రమే లభిస్తుంది.
Surveyవాస్తవానికి, LG Wing స్మార్ట్ ఫోన్ MRP ధర మాత్రమే Rs.80,000. కానీ, 2020 అక్టోబరు లో ఈ ఫోన్ ను LG పరిచయం చేసినప్పుడు దీన్ని Rs.69,990 రూపాయల ధరతో పరిచయం చేసింది. అయితే, ఈ ఫోన్ ఈ ధరలో వచ్చిన మిగతా ఫోన్ల మాదిరిగా టాప్ ఆఫ్ ద లైన్ ప్రాసెసర్ తో మాత్రం లేదు. కానీ, ప్రస్తుతం Flipkart అఫర్ నుండి ఇవ్వనున్నట్లు చూపిస్తున్న Rs.29,999 ధరకు మాత్రం ఇది సాటిలేని ఫోనుగా ఉంటుంది. అఫర్ కోసం Click Here
LG Wing: ప్రత్యేకతలు
LG Wing డ్యూయల్ స్క్రీన్ తో వస్తుంది. వీటిలో పెద్ద స్క్రీన్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటక్షన్ గల 6.8-ఇంచ్ FHD+ డిస్ప్లేతో వుంటుంది. మరొక డిస్ప్లే 3.9 ఇంచ్ పరిమాణంతో వుంటుంది. ఈ ఫోన్ లేటెస్ట్ ఫాస్ట్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 765G ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఇది 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ జతగా వస్తుంది.
ఇక కెమెరాల పరంగా ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఇందులో, 64MP కెమెరా OIS సపోర్ట్ తో వస్తుంది. దీనికి జతగా 13MP అల్ట్రా వైడ్ కెమెరా మరియు 12MP గింబాల్ అల్ట్రా వైడ్ కెమెరా వున్నాయి. ముందు భాగంలో, 32MP సెల్ఫీ కెమెరా వుంది. ఈ ఫోన్ 4000mAh బ్యాటరీతో వస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
