Tecno Pova గురించి 5 ముఖ్యమైన విషయాలు

Tecno Pova గురించి 5 ముఖ్యమైన విషయాలు
HIGHLIGHTS

మంచి ఫీచర్లతో టెక్నో పోవా భారతదేశంలో ప్రారంభించబడింది

Tecno Pova అపారమైన 6,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.

ఈ ఫోన్ వేగవంతమైన మీడియాటెక్ హెలియో జి 80 SoC తో వస్తుంది.

బడ్జెట్ వినియోగదారుల కోసం మంచి ఫీచర్లతో టెక్నో పోవా భారతదేశంలో ప్రారంభించబడింది. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో మరియు మూడు వేర్వేరు రంగు ఎంపికలలో వస్తుంది.  ఇది హోల్-పంచ్ డిస్ప్లే మరియు అపారమైన 6,000 ఎంఏహెచ్ బ్యాటరీతో 6.8-అంగుళాల హెచ్‌డి + స్క్రీన్‌తో వస్తుంది. అందుకే, టెక్నో యొక్క ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ గురించి మీరు తెలుసుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం.  

1. ఈ ఫోన్ బడ్జెట్ సెగ్మెంట్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని మంచి ఫీచర్లతో తీసుకురాబడింది మరియు భద్రత కోసం వెనుకవైపు వేలిముద్ర సెన్సార్‌తో వస్తుంది. ఇది క్వాడ్ రియర్ కెమెరా సెటప్ మరియు అన్ని కలర్ ఆప్షన్లలో షిమ్మర్ ఎఫెక్ట్‌ను కలిగి ఉంది.

2. ఈ ఫోన్ వేగవంతమైన మీడియాటెక్ హెలియో జి 80 SoC తో వస్తుంది. ఇది ఆక్టా-కోర్ సిపియుతో పాటు 4 జిబి ర్యామ్‌తో ఉంటుంది. ఆండ్రాయిడ్ 10 పై ఆధారపడిన ఈ ఫోన్ HiOS 7.0 లో నడుస్తుంది. ఇక డిస్ప్లే విషయానికి వస్తే, పెద్ద 6.8-అంగుళాల HD + స్క్రీన్ 720 x 1640 పిక్సెల్స్ రిజల్యూషన్ కలిగి ఉంది, పిక్సెల్ డెన్సిటీ 264PPI గా ఉంటుంది.

3. కెమెరా: వెనుక క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌లో 13MP ప్రాధమిక సెన్సార్ మరియు డెప్త్ నియంత్రణ కోసం 2MP సెన్సార్‌లు మరియు AI ఫీచర్ల కోసం డేడికేటెడ్ మాక్రో లెన్స్‌తో  ఉంటుంది. సెల్ఫీల కోసం, ఇది AI ఫీచర్ తో ఫోన్ పైభాగంలో ఇయర్‌పీస్ పక్కన డ్యూయల్ ఫ్లాష్‌తో కూడిన 8MP డాట్-ఇన్ కెమెరాను కలిగి ఉంటుంది.

4. బ్యాటరీకి పరంగా, ఇది 6,000 ఎమ్ఏహెచ్ భారీ బ్యాటరీని కలిగి ఉంది. కంపెనీ వాదనల ప్రకారం ఫోన్‌ను 30 రోజుల వరకు స్టాండ్‌బైలో ఉంచగలదు. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది మరియు ఇతర సింగిల్ ఐసి ఆధారిత ఫాస్ట్ ఛార్జింగ్ పరికరాల కంటే ఫోన్ 20% వేగంగా ఛార్జ్ చేయగలదని కంపెనీ పేర్కొంది.

5. ఫోన్ యొక్క 4 జిబి ర్యామ్ మరియు 64 జిబి స్టోరేజ్ బేస్ వేరియంట్ 9,999 రూపాయలు. ఇక అప్‌గ్రేడ్ చేసిన 6 జిబి ర్యామ్ మరియు 128 జిబి స్టోరేజ్ రూ .11,999 ధరతో వస్తుంది. ఈ ఫోన్ డిసెంబర్ 11 నుండి ఫ్లిప్‌కార్ట్‌లో మధ్యాహ్నం 12 గంటల నుండి అమ్మకళను కొనసాగించనుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo