డెల్ జి3 గేమింగ్ ల్యాప్ టాప్ అందించనున్న ఆఫర్ ఇవిగో

డెల్ జి3 గేమింగ్ ల్యాప్ టాప్ అందించనున్న ఆఫర్ ఇవిగో
HIGHLIGHTS

డెల్ జి3 గేమింగ్ ల్యాప్ టాప్ ఒక 15 అంగుళాల డిస్ప్లేని కలిగి ఉంది మరియు ఇది 8 వ జెనరేషన్ కి చెందిన ఇంటెల్ కోర్ i7 ప్రాసెసర్ తో అందుబాటులో ఉంది. గేమర్స్ కూడా ఒక ఎన్విడియా జియో ఫోర్స్ జిటిఎక్స్1050 టిఐ గ్రాఫిక్స్ కార్డును ఎంపికగా ఎంచుకునే వీలుంటుంది.

గేమింగ్ ల్యాప్ టాప్ కొనుగోలు చేసేటప్పుడు గేమర్స్ సాధారణంగా చాల  గందరగోళాన్ని ఎదుర్కొంటారు. వారు సహజంగా అత్యంత ఆధునిక గేమ్స్ అమలు చేయడానికి తగినంత శక్తివంతమైనది మరియు చేతిలో పెట్టుకు తిరగడానికి తగిన తక్కువ బరువైనదిగాను ఉన్న ఒక డివైజ్ కోసం చూస్తున్నారు. గేమింగ్ ల్యాప్ టాప్ యొక్క జి3 శ్రేణితో, డెల్ ఇప్పుడు కేవలం అలాంటి డివైజ్ ని అందించడానికి ప్రయత్నిస్తుంది.

డెల్ జి3 గేమింగ్ ల్యాప్ టాప్ గురించి చెప్పాల్సిన మొదటి విషయం ఏమిటంటే దాని రూపకల్పన. ఈ ల్యాప్ టాప్ ఏ కోణీయ లైన్లు లేదా ప్రకాశవంతమైన రంగులను చూపించని ఒక సొగసైన మాట్టే ఫినిష్ ని కలిగి ఉంటుంది. ఫలితంగా, ల్యాప్ టాప్ చాలా నియంత్రణలో ఉంటుంది. ల్యాప్ టాప్ యొక్క పోర్టబిలిటీ యాస్పెక్ట్ విషయానికి వస్తే , డెల్ జి3 22.7mm మందంతో సన్నగా మరియు 2.53కేజీల  బరువుతో చాల తేలికగా ఉంటుంది. ఇది ఒక పెద్ద 15 అంగుళాల డిస్ప్లేని కలిగి ఉన్నప్పటికీ వినియోగదారులు దానిని తీసికొని తిరగడానికి అనుకూలంగా ఉంటుంది .

ఒక గేమింగ్ ల్యాప్ టాప్ అనేది దాని పనితీరు మాత్రమే వివరిస్తుంది ,ఇంకా డెల్ జి3 అందంగా ఆకట్టుకునే స్పెసిఫికేషన్స్ అందిస్తుంది. డెల్ జి3 యొక్క ఉన్నతస్థాయి   వేరియంట్ ఒక 8 వ జెనరేషన్ ఇంటెల్ కోర్ i7-8750H ప్రాసెసర్ తో లభిస్తుంది, ఇది టర్బో బూస్ట్తో 4.1GHz వరకు క్లాక్ స్పీడ్ ని అందిస్తుంది. గ్రాఫిక్స్ వెళ్లినంత వరకు, ఈ ప్రత్యేక వేరియంట్  ఒక ఎన్విడియా జియో ఫోర్స్ జిటిఎక్స్1050 టిఐ ని కలిగి వుంది. ఇది 16జీబీ డిడిఆర్4 ర్యామ్ మరియు 256జీబీ ఎస్ఎస్డి మరియు ఒక 1టీబీ  5400ఆర్పిఎమ్ హార్డ్ డ్రైవ్ ను కలిగి ఉండే హైబ్రిడ్ స్టోరేజి వ్యవస్థను అందిస్తుంది.  గంటల తరబడి గేమ్స్ ఆడిన   తర్వాత కూడా ఈ సిస్టంలోని వ్యవస్థని చల్లగా వుంచడానికి  ఈ సిరీస్ లోని అన్ని ల్యాప్ టాప్ లలో రియర్ ఫేసింగ్ వెంటిలేటర్స్ తో కూడిన రెండు ఫాన్స్ కలిగి ఉంటాయి.

ఇలాంటి పలు లక్షణాలతో, డెల్ జి3 ఖచ్చితంగా ఒక సన్నని మరియు తేలికైన గేమింగ్ లాప్టాప్ కోసం చూస్తున్నప్పుడు ఎంపికగా దీనిని పరిగణలో  తీసికోవడానికి  సులభంగా ఉంటుంది.ఇంకా ఈ ల్యాప్ టాప్ కూడా ఆకర్షణీయమైన ధరతో కూడుకున్నది, దీని బేస్ వేరియంట్  రూ . 80,890 నుండి  మొదలవుతుంది. డెల్ జి3 యొక్క ప్రారంభ వేరియంట్ 8జీబీ ర్యామ్ తో 8 వ జనరేషన్ ఇంటెల్ కోర్ i5  ఎన్విడియా జియో ఫోర్స్ 1050 యొక్క ధర  రూ . 80,890 రూపాయలకి లభిస్తుంది, టాప్-ఆఫ్-లైన్ వేరియంట్ రూ. 1,05,390 గా ఉంది. ఇక్కడ డెల్ జి3 యొక్క వివిధ రకాలైన వేరియంట్లు అందుబాటులో ఉన్నందున   గేమర్స్ వారి యొక్క   అవసరాలు మరియు బడ్జెట్ ఆధారంగా ఎంచుకోవడానికి వీలుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo