ల్యాప్ టాప్ కొనేముందుగా మీరు తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయాలు

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 27 Jul 2020
HIGHLIGHTS

ఇప్పుడు మార్కెట్ లో ప్రతి బడ్జెట్ స్థాయిలో మనకు కావాల్సినన్ని ఎంపికలు అందుబాటులో ఉంటాయి.

మనం తెలుసుకోవాల్సిందల్లా మన అవసరాన్ని బట్టి మనకు కావాల్సిన ల్యాప్ టాప్ ఎంచుకోవడం.

ఇది మనకు అన్ని విధాలా ఉత్తమంగా ఉంటుంది.

ల్యాప్ టాప్ కొనేముందుగా మీరు తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయాలు
ల్యాప్ టాప్ కొనేముందుగా మీరు తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయాలు

Vostro 3501

Popular tech to stay connected anywhere. Save more on exciting Dell PCs.

Click here to know more

Advertisements

ప్రస్తుతం, నానాటికి పెరుగుతున్న టెక్నలాజితో  మీకు ప్రతీ అవసరానికి తగిన ఒక మంచి ల్యాప్ టాప్  ని కొనాలంటే, మార్కెట్లో ఉన్న అనేకమైన వాటిలో, సరైన ల్యాప్ టాప్ ఎంచుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అంతేకాదు, ఇప్పుడు మార్కెట్ లో ప్రతి బడ్జెట్ స్థాయిలో మనకు కావాల్సినన్ని ఎంపికలు అందుబాటులో ఉంటాయి. కానీ, మనం తెలుసుకోవాల్సిందల్లా మన అవసరాన్ని బట్టి మనకు కావాల్సిన ల్యాప్ టాప్ ఎంచుకోవడం,. ఇది మనకు అన్ని విధాలా  ఉత్తమంగా ఉంటుంది. 

కాబట్టి, మీకు అవసరమైన ప్రత్యేకతలు మరియు ఫీచర్ల జాబితాను ఒకసారి మీరు వివిధ విభాగాలలో మేము ఇచ్చిన సూచనలతో  సరిపోల్చుకోవడం ద్వారా, అది మీకు సరైన ల్యాప్ టాప్ ఎంపిక చెయ్యడానికి సహాయం చేస్తుంది.

 వినియోగ అవసరాలు - మీరు ల్యాప్టాప్ ఎలా ఉపయోగిస్తారనే దాని గురించి ఆలోచించడం మొదటి విషయం. సాధారణంగా, వినియోగ అవసరాలు నాలుగు రకాలుగా విభజించవచ్చు, వీటిని  క్రింద జాబితా చేశాము.

• తేలిక వినియోగం

ఈ రకమైన వినియోగం కంప్యూటర్లో మీకు కావాల్సిన పనులు చేయడానికి చాలా తక్కువ కాన్ఫిగరేషన్ మాత్రమే అవసరం. వెబ్ సర్ఫింగ్, ఆన్లైన్ బిల్లులు చెల్లించడం, ఇమెయిల్ మరియు సోషల్ మీడియా వంటి విషయాలు ఇందులో భాగంగా ఉన్నాయి. అలాగే, మీరు సినిమాలు లేదా స్ట్రీమ్ కంటెంట్ను కూడా చూడవచ్చు. మీరు ఈ కోవకు చెందిన వినియోగం కలిగి ఉంటే తక్కువ కాన్ఫిగరేషన్ మరియు బడ్జెట్ ల్యాప్ టాప్ ని ఎంచుకోవచ్చు.  

• మధ్యస్థ వినియోగం

వారి పనిలో భాగంగా ఎక్కువగా టైప్ చేసేవారు, ఫోటోలు ఎడిట్ మరియు బ్రౌజ్ చేసి వారు ఈ వినియోగపరిధిలోకి వస్తారు. ఎక్కువ సెర్చింగ్ చేయవలసి ఉండడం, మీకు ఇష్టమైన వెబ్-బ్రౌజర్ యొక్క అసంఖ్యాకమైన ట్యాబ్లను అర్థం చేసుకోవచ్చు. మీరు పూర్తి HD సినిమాల లైబ్రరీని కలిగి ఉంటే, మీ మీడియా ప్లేయర్ కొంచెం శక్తివంతమైన ల్యాప్ టాప్ కావాలి, తద్వారా సినిమాలు ఏ లాగ్ లేకుండా చూడవచ్చు. మీరు ఈ కోవకు చెందిన వినియోగం కలిగి ఉంటే ఒక మోస్తరు కాన్ఫిగరేషన్ మరియు మిడ్ రేంజ్ ల్యాప్ టాప్ ని ఎంచుకోవచ్చు.  

• భారీ మరియు డిమాండ్ వినియోగం

మీరు కంటెంట్ క్రియేటర్ లేదా ఉత్సాహక గేమర్ అయితే, మీ ల్యాప్ టాప్ అత్యంత ఉన్నత స్థాయి భాగాలను కలిగివుండాల్సి ఉంటుంది . అది మంచి  Photoshop లేదా వీడియో సవరణ టూల్స్ అయినా లేదా PUBG  గేమ్ ప్లే అయినా, ఎటువంటి అవసరమైన,  మీ ల్యాప్ టాప్ లో మీకు ప్రత్యేకమైన భాగాలు అవసరమవతాయి, తద్వారా దీని నుండి మీరు ఎక్కువగా ప్రయోజనాలను పొందవచ్చు. మీరు ఈ కోవకు చెందిన వినియోగం కలిగి ఉంటే హై ఎండ్  కాన్ఫిగరేషన్ మరియు ప్రీమియం  ల్యాప్ టాప్ ని ఎంచుకోవాల్సి ఉంటుంది.  

logo
Raja Pullagura

Web Title: The most important things you need to know before buying a laptop
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements
Advertisements

హాట్ డీల్స్

మొత్తం చూపించు

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status