TikTok వీడియో డౌన్లోడ్ : స్టెప్ బై స్టెప్ గైడ్
సులభమైన స్టెప్స్ ద్వారా ఈ విషయాన్ని తెలుసుకోనున్నాము.
మీరు దీన్ని సులభంగా చేయవచ్చు.
గత కొన్ని రోజులుగా టిక్‌టాక్ రేటింగ్ ఘోరంగా పడిపోయాయని మాకు తెలుసు. టిక్ టాక్ ను నిలిపి వేయాలని చాలా మంది ప్రజలు చెబుతున్నప్పటికీ , ఇప్పటికీ టిక్ టాక్ చాలా మందికి వినోద సాధనంగా మారిందని కూడా చెప్పవచ్చు. అందుకే, వారు తమ వినోదం కోసం ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను కూడా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. వాస్తవానికి, చాలా మంది ఈ వీడియోలను చూడడమే కాకుండా, వాటిని డౌన్‌లోడ్ కూడా చేసుకోవాలనుకుంటున్నారు. అటువంటి పరిస్థితిలో వారు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. మీరు ఈ టిక్‌టాక్ వీడియోలను షేర్ చేయాలనుకుంటే, మీరు ఈ యాప్ లోనే ఒక ఎంపిక ద్వారా నేరుగా సమ్మెకు నచ్చిన వారికీ షేర్ చేయవచ్చు.
Surveyఅయితే, మీరు ఈ టిక్‌టాక్ వీడియోలను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో అని ఆలోచిస్తున్నట్లయితే, ఈ రోజు మనం కొన్ని సులభమైన స్టెప్స్ ద్వారా ఈ విషయాన్ని తెలుసుకోనున్నాము. దీని ద్వారా మీరు దీన్ని సులభంగా చేయవచ్చు. ఫేస్‌బుక్ మరియు యూట్యూబ్‌లో కూడా వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని మనందరికీ తెలుసు, అయితే దీని కోసం మీరు కొన్ని Tools ఉపయోగించాలి. అదేవిధంగా మీరు టిక్‌టాక్ వీడియోలను కూడా డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే కూడా ఇలానే చేయాల్సి వస్తుంది.
టిక్‌టాక్ వీడియోను డౌన్‌లోడ్ చేయడం ఎలా
ఈ క్రింది పాయింట్లు లేదా దశలను అనుసరించడం ద్వారా మీరు ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో టిక్‌టాక్ వీడియోలను సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
మీ మొబైల్ ఫోన్‌లో టిక్‌టాక్‌ను తెరిచి, ఆపై మీరు డౌన్‌లోడ్ చేయదలిచిన వీడియోను ఎంచుకోండి.
దీని తరువాత మీరు Share చిహ్నంపై క్లిక్ చేసి, Save వీడియోను ఎంచుకోండి.
ఇలా చేయడం ద్వారా, ఈ వీడియో మీ ఫోన్‌లో ఆటొమ్యాటిగ్గా సేవ్ చేయబడుతుంది.
వాట్‌మార్క్ లేకుండా టిక్‌టాక్ వీడియోలను డౌన్‌లోడ్ చేయడం ఎలా?
మీ కంప్యూటర్ లేదా ఫోన్‌లో టిక్‌టాక్ తెరిచి, ఆపై మీరు డౌన్‌లోడ్ చేయదలిచిన వీడియోను ఎంచుకోండి.
మీ ఫోన్‌లో, మీరు షేర్ బటన్‌పై క్లిక్ చేసి, కాపీ లింక్‌పై క్లిక్ చేయాలి, ఇది కాకుండా మీరు మీ కంప్యూటర్‌లో కూడా చేయవచ్చు.
అయితే దీని కోసం మీరు అడ్రెస్స్ బార్ కి వెళ్ళాలి లేదా ప్లే స్టోర్ నుండి tiktok డౌన్లోడర్ యాప్ తో ట్రై చెయ్యొచ్చు.
మీరు కాపీ చేసిన లింక్ ను డౌన్లోడర్ యాప్ లో సూచించిన దగ్గర జతచేయాలి .
ఇప్పుడు మీరు డౌన్‌లోడ్ పై క్లిక్ చేయాలి.
దీని తరువాత, తెరపై మీరు డౌన్‌లోడ్ MP4 ను ఎంచుకుని, డౌన్‌లోడ్ వీడియో నౌ పై క్లిక్ చేయాలి.
అంతే, వాటర్ మార్క్ లేకుండా మీకు నచ్చిన వీడియోని సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile