YouTube నుండి 22 లక్షల ఇండియన్స్ వీడియోలు డిలీట్.. ఎందుకంటే.!

YouTube నుండి 22 లక్షల ఇండియన్స్ వీడియోలు డిలీట్.. ఎందుకంటే.!
HIGHLIGHTS

గూగుల్ యాజమాన్యంలోని యూట్యూబ్ అతిపెద్ద న్యూస్ అందించింది

YouTube నుండి 22 లక్షల ఇండియన్స్ వీడియోలు అవుట్ అయ్యాయి

చాలా చానల్స్ ని కూడా యూట్యూబ్ పూర్తిగా నిలిపివేసినట్టు ప్రకటించింది

అతిపెద్ద టెక్ దిగ్గజం గూగుల్ యాజమాన్యంలోని యూట్యూబ్ అతిపెద్ద న్యూస్ అందించింది. ఎన్నడూ లేని విధంగా YouTube నుండి 22 లక్షల ఇండియన్స్ వీడియోలు అవుట్ అయ్యాయి. కేవలం వీడియోలు మాత్రమే కాదు చాలా చానల్స్ ని కూడా యూట్యూబ్ పూర్తిగా నిషేధించినట్లు ప్రకటించింది. ఈ వార్త విన్న తర్వాత కంటెంట్ క్రియేటర్స్ మరియు ఇప్పుడిప్పుడే కొత్తగా యూట్యూబ్లో నిలదొక్కుకుంటున్న కొత్తవారు కూడా ఉలిక్కిపడి పడతారు.

YouTube నుండి ఎందుకు వీడియోలు డిలేట్ చేసింది?

యూట్యూబ్ నుండి వీడియోలు తొలగించడానికి సరైన కారణమే ఉంది. యూట్యూబ్ నియమాలకు విరుద్ధంగా ఉన్న వీడియోలను యూట్యూబ్ డిలీట్ చేసినట్లు తెలియపరిచింది. వాస్తవానికి, కేవలం భారతీయుల వీడియోలు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా 90 లక్షలకు పైగా వీడియోలను యూట్యూబ్ డిలీట్ చేసింది.

YouTube Video
YouTube Video

ఈ వీడియోలన్నీ కూడా 2023 వ సంవత్సరం అక్టోబర్ నెల నుండి డిసెంబర్ నెల వరకు పరిశీలించి డిలీట్ చేయబడినవి. అయితే, ప్రపంచవ్యాప్తంగా 90 లక్షలు వీడియోలు డిలీట్ అయితే కేవలం భారతీయుల అకౌంట్స్ నుంచి డిలీట్ చేయబడిన వీడియోలు అత్యధికంగా 25 లక్షలు ఉన్నాయి.

ఇక యూట్యూబ్ నుంచి వీడియోలు డిలీట్ చేయబడిన లిస్టులోకి వెళ్తే, ఇండియా ప్రథమ స్థానంలో నిలవగా, రెండవ స్థానంలో సింగపూర్ నిలిచింది. సింగపూర్ నుంచి అప్లోడ్ చేయబడిన 12 లక్షల పైగా వీడియోలను యూట్యూబ్ డిలీట్ చేసినట్టు తెలియజేసింది.

Also Read: Realme 12X 5G: టాప్-5 ఫీచర్స్ మరియు ప్రైస్ డీటెయిల్స్ లాంఛ్ కంటే ముందే తెలుసుకోండి.!

అయితే, ఇందులో ఎక్కువ వీడియోలు అతి తక్కువ వ్యూస్ కలిగిన వీడియోస్ ఉన్నట్లు కూడా తెలియజేసింది. కేవలం 10 శాతం వీడియోలు మాత్రమే 10,000 కంటే ఎక్కువ యూస్ ను కలిగి ఉన్నట్లు యూట్యూబ్ తెలిపింది.

YouTube ఎన్ని చానళ్లను నిషేదించింది?

ఇక యూట్యూబ్ నిషేధం విధించిన ఛానల్ విషయానికి వస్తే, ప్రపంచవ్యాప్తంగా రెండు కోట్లకు పైగా యూట్యూబ్ ఛానల్ ను నిషేధించింది. యూట్యూబ్ యొక్క మార్గదర్శకాలను పాటించని ఛానల్ ను పూర్తిగా నిషేధించినట్లు పేర్కొంది. హింస, మోసపూరిత, హానికరమైన, న్యూడిటి మరియు వల్గర్ ను కలిగి ఉన్న చాన్నాళ్లను నిషేధించినట్లు యూట్యూబ్ కన్ఫర్మ్ చేసింది.

Tags:

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo