బడా బ్రాండ్ ఫోన్లకు దీటైన స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన షియోమీ

బడా బ్రాండ్ ఫోన్లకు దీటైన స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన షియోమీ
HIGHLIGHTS

షియోమీ 12S అల్ట్రా ను బ్రాండ్స్ బ్రాడ్స్ ఫోన్లకు సైతం పోటీగా నిలిచేలా గొప్ప ఫీచర్లతో అందించింది.

షియోమి 12S అల్ట్రా E5 AMOLED డిస్ప్లేని QHD+ రిజల్యూషన్ తో కలిగివుంది

కెమెరా విభాగంలో Leica లెన్స్, Leica ఫిల్టర్‌లు, Dolby Vision మరియు HyperOIS వంటి ఫీచర్లను పొందుతారు

షియోమీ ఈరోజు చైనాలో షియోమీ 12S అల్ట్రా తో పాటుగా షియోమీ 12S మరియు షియోమీ 12S ప్రో వేరియంట్ లను కూడా విడుదల చేసింది. వీటిలో, షియోమీ 12S అల్ట్రా స్మార్ట్ ఫోన్ ను బడా బ్రాండ్స్ స్మార్ట్ ఫోన్లకు సైతం పోటీగా నిలిచేలా గొప్ప ఫీచర్లతో అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ ఏకంగా 1 ఇంచ్ బిగ్ Sony సెన్సార్ తో పాటుగా ప్రముఖ జర్మన్ ఇమేజింగ్ కంపెనీ Leica యొక్క ఆప్టిక్స్ ను కూడా జతచేసింది. ఈ స్మార్ట్ ఫోన్ మొత్తంగా అన్ని వివరాల్లో కూడా ప్రీమియం ఫీచర్లతో ఉంటుంది. ఈ లేటెస్ట్ షియోమీ స్మార్ట్ ఫోన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ తెలుసుకోవచ్చు.

షియోమీ 12S అల్ట్రా : ధర (చైనా)

షియోమీ 12S అల్ట్రా ధర విషయానికి వస్తే, చైనాలో  8/256GB వేరియంట్‌ ను CNY 5,999 (సుమారు రూ.70,829) ధరతో ప్రకటించింది, 12GB /256GB మోడల్‌ ధర CNY 6,499 (సుమారు రూ.76,732), మరియు 12GB /512GB మోడల్ CNY 6999 (సుమారు రూ.82,61) ధరతో లాంచ్ చేసింది.    

షియోమీ 12S అల్ట్రా : స్పెక్స్

షియోమి 12S అల్ట్రా 10-bit 6.73-అంగుళాల E5 AMOLED డిస్ప్లేని QHD+ రిజల్యూషన్ తో కలిగివుంది. ఇది Dolby Vision మరియు HDR10+ సపోర్ట్ తో పాటుగా 120Hz రిఫ్రెష్ రేట్‌ మరియు 1500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. ఈ ఫోన్ లేటెస్ట్ క్వాల్కమ్ ప్రొసెసర్ Snapdragon 8 Gen1 SoC తో వస్తుంది. అలాగే, ఈ ఫోన్ LPDDR5 12GB RAM మరియు UFS 3.1 512GB వరకు స్టోరేజ్ ఎంపికతో జత చేయబడింది మరియు MIUI 13 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 12 OS పైన నడుస్తుంది.

షియోమీ 12S అల్ట్రా Sony 1 inch బిగ్ సెన్సార్ 50MP (IMX989) కెమెరాకి జతగా 48MP అల్ట్రా-వైడ్ కెమెరా, 48MP 120mm 5x పెరిస్కోప్ జూమ్ మరియు 3D ToF డెప్త్ సెన్సార్‌ ను కలిగివుంది. క్వాలిటీ ఫోటల కోసం ప్రముఖ ఇమేజింగ్ కంపెనీ Leica తో కూడా జత కలిసింది. అలాగే, సెల్ఫీల కోసం ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా ఉంది. కెమెరా విభాగంలో, మీరు Leica లెన్స్, Leica ఫిల్టర్‌లు, Dolby Vision మరియు HyperOIS వంటి ఫీచర్లను పొందుతారు.

షియోమీ 12S అల్ట్రా స్మార్ట్ ఫోన్ 4,860mAh బ్యాటరీని 67W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ తో అందించింది. అంతేకాదు, 10W రివర్స్ వైర్ లెస్ ఛార్జింగ్ కు కూడా సపోర్ట్ చేస్తుంది.  ఈ ఫోన్ కౌటర్ బ్లూ, నోయిర్ బ్లాక్ మరియు ఒపేరా మౌవే అనే మూడు విలక్షణమైన కలర్ అప్షన్ లలో లభిస్తుంది. ఇక ఇతర ఫీచర్ల పరంగా, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్ రీడర్, USB-C 2.0, WiFi 6e, బ్లూటూత్ 5.2, NavIC, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు మరియు గొరిల్లా గ్లాస్ విక్టస్ సేఫ్టీ కూడా పొందుతారు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo