మైక్రోసాఫ్ట్ యూజర్లకు గుడ్ న్యూస్ .. Outlook సేవలు ఎప్పటి నుంచి సాధారణ స్థితికి వస్తాయంటే.!
మైక్రోసాఫ్ట్ యూజర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన సర్వర్ సమస్య పరిష్కారం దిశగా మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయాలు
Outlook, Microsoft Teams, Copilot సహా Microsoft 365 సేవల్లో తలెత్తిన అంతరాయాన్ని తొలగించేందుకు కంపెనీ కొత్త ప్యాచ్
ప్యాచ్ కారణంగా సర్వర్ల పనితీరులో సానుకూల మార్పులు కనిపిస్తున్నాయని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది
మైక్రోసాఫ్ట్ యూజర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన సర్వర్ సమస్య పరిష్కారం దిశగా మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయాలు తీసుకుంది మరియు విజయం దిశగా ముందడుగు పడింది. ప్రపంచవ్యాప్తంగా Outlook, Microsoft Teams, Copilot సహా Microsoft 365 సేవల్లో తలెత్తిన అంతరాయాన్ని తొలగించేందుకు కంపెనీ కొత్త ప్యాచ్ ను అమలు చేసింది. ఈ ప్యాచ్ కారణంగా సర్వర్ల పనితీరులో సానుకూల మార్పులు కనిపిస్తున్నాయని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది.
Outlook సమస్య ఏమిటి?
నవంబర్ 12 నుంచి ప్రారంభమైన ఈ అంతరాయం కారణంగా చాలా మంది యూజర్లు తమ Outlook ఖాతాల్లోకి లాగిన్ అవ్వలేకపోయారు. ఇన్ బాక్స్ లోడ్ కాకపోవడం, ఈమెయిల్స్ పంపడం, స్వీకరించడంలో మరికొందరికి సమస్యలు ఎదురయ్యాయి. ముఖ్యంగా ఆఫీస్ పనుల కోసం Microsoft 365 సేవలపై ఆధారపడి పనులు నిర్వచించే ఉద్యోగులు మరియు సంస్థలు ఈ అంతరాయం తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
కొత్త ప్యాచ్ తో సర్వర్ల స్థిరత్వం
మైక్రోసాఫ్ట్ తన అధికారిక Microsoft 365 Service Health అప్ డేట్ లో MO1550821 అనే ఇన్సిడెంట్ కు సంబంధించిన వివరాలను వెల్లడించింది. సర్వర్లపై పెరిగిన ఒత్తిడిని తగ్గించేందుకు గతంలో చేపట్టిన చర్యలు ఆశించిన స్థాయిలో పనిచేయకపోవడంతో, తాజాగా మరో పరిష్కారాన్ని అమలు చేసింది. ఇందులో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోని కొంత భాగానికి అప్ స్ట్రీమ్ ఆథెంటికేషన్, రూటింగ్ కాన్ఫిగరేషన్ కాంపోనెంట్ కు సంబంధించిన ప్యాచ్ ను వర్తింపజేసింది.
ఈ కొత్త ప్యాచ్ అమలు తర్వాత సర్వర్ల స్థిరత్వం లో సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ఫ్రంట్ ఎండ్ సర్వర్లను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడంతో పాటు, ట్రాఫిక్ ను సమర్థంగా నిర్వహించేందుకు మైక్రోసాఫ్ట్ చర్యలు కొనసాగిస్తోంది.
Outlook సేవలు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయి?
Outlook సేవలు పనిచేస్తున్నాయో లేదో తెలుసుకోవాలంటే మైక్రోసాఫ్ట్ అధికారిక సర్వీస్ స్టేటస్ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు. అక్కడ తాజా అప్ డేట్స్ అందుబాటులో ఉంటాయి. అత్యవసరమైన ఈమెయిల్స్ కోసం తాత్కాలికంగా ప్రత్యామ్నాయ మెయిల్ సేవలను ఉపయోగించడం మంచిది.
మొత్తానికి కొత్త ప్యాచ్ తో మైక్రోసాఫ్ట్ సర్వర్ల స్థిరత్వంలో మెరుగుదల కనిపించడం యూజర్లకు ఊరటనిచ్చే విషయం. అయితే, అన్ని ప్రాంతాల్లో Outlook, Teams మరియు Copilot సేవలు పూర్తిగా సాధారణ స్థితికి వచ్చే వరకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.