వాట్సాప్ ఉపయోగించే ప్రతిఒక్కరికీ కూడా 'Delete For Every one' గురించి పెద్దగా చెప్పవలసిన అవసరం లేదు. వాట్సాప్ లో అనుకోకుండా లేదా యాక్సిడెంటల్ గా ఏదైనా మెసేజ్ చేస్తే దాన్ని ఎవరూ చూడకుండా డిలీట్ చేసేందుకు ఈ అప్షన్ ఉపయోగిస్తాము. ప్రస్తుతం చాలా లిమిటెడ్ టైం వరకూ మాత్రమే ఈ డిలీట్ అప్షన్ అందుబాటులో ఉండగా, వాట్సాప్ ఇప్పుడు దీన్ని 2 రోజుల 12 గంటల వరకూ పెంచడానికి చూస్తోంది.
Survey
✅ Thank you for completing the survey!
వాస్తవానికి, ఇప్పటి వరకూ 1 గంట, 8 నిమిషాలు మరియు 16 సెకన్ల లోపలే ఏదైనా మెసేజ్ ను 'Delete For Every One' అప్షన్ తో తొలగించడానికి వీలుంది. అయితే, వాటప్ ఇప్పుడు ఈ సమయాన్ని 2 రోజుల 12 గంటల వరకూ పెంచునట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొంత మంది బీటా యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది మరియు రానున్న రోజుల్లో మరింత మందికి అంధిస్తుంది.
ఈ ప్రముఖ మెసేజింగ్ యాప్, ముఖ్యంగా గ్రూప్ లలోని ఏదైనా మెసేజ్‌ని డిలీట్ చేయడానికి గ్రూప్ అడ్మిన్ లను అనుమతించే సామర్థ్యంపై పని చేస్తోంది. అంటే, గ్రూప్ లలో ఏదైనా మెసేజ్ తప్పుగా అనిపించినట్లయితే ఈ ఫీచర్ ద్వారా ఆ గ్రూప్ అడ్మిన్ ఆ మెసేజ్ ను తొలగించ వచ్చన్న మాట.