ఈ వారం OTT లో స్ట్రీమ్ కాబోతున్న కొత్త సినిమాలు..!!
ఈ వారం OTT లో మూడు కొత్త సినిమాలు స్ట్రీమ్ కాబోతున్నాయి
వేరు వేరు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పైన రిలీజ్ కాబోతున్నాయి
ఈ వారం OTT లో వస్తున్న 'అశోక వనంలో అర్జున కళ్యాణం'
ఈ వారం OTT లో మూడు కొత్త సినిమాలు స్ట్రీమ్ కాబోతున్నాయి. ఈ మూడు సినిమాలు కూడా వేరు వేరు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పైన రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో, అందరూ ఆశక్తిగా ఎదురు చూస్తున్న 'అశోక వనంలో అర్జున కళ్యాణం' తో పాటుగా లీగల్ డ్రామా మలయాళీ మూవీ 'జన గణ మన' వంటి సినిమాలు ఉన్నాయి. అంతేకాదు, 2022 బ్లాక్ బాస్టర్ మూవీ KGF చాఫ్టర్ 2 ప్రస్తుతం 199 రూపాయల రెంటల్ సబ్ సబ్ స్క్రిప్షన్ తో అందుబాటులో ఉండగా, ఈ వారం అమెజాన్ ప్రైమ్ వీడియో అందరికి సబ్ స్క్రైబర్స్ అందరికి అందుబటులోకి రావచ్చని అంచనా వేస్తున్నారు.
Surveyజన గణ మన
పృథ్వీరాజ్ మరియు సూరజ్ వెంజరాముడు కలిసి నటించిన మలయాళీ మూవీ 'జన గణ మన' ఈ వారం ఓటీటీలో విడుదల కాబోతోంది. ఈ సినిమా మలయాళం, తెలుగు, తమిళం మరియు కన్నడ భాషల్లో వస్తుంది. ఏప్రిల్ 28 న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి టాక్ ను అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా జూన్ 2 న Netflix లో రిలీజ్ కాబోతోంది.
అశోక వనంలో అర్జున కళ్యాణం
విశ్వక్ సేన్ మరియు రుక్సార్ ధిల్లాన్ జంటగా నటించిన ఈ చిత్రం విడుదల కంటే ముందే కాంట్రవర్సీ మూవీగా పేరుతెచ్చుకుంది. అయితే, ఈ సినిమా థియేటర్లలో కాసుల వర్షం కురిపించింది. ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చొని ఎంజాయ్ చేయదగిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇప్పుడు OTT లో కోడోత్ రిలీజ్ కాబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అశోక వనంలో అర్జున కళ్యాణం వచ్చే శుక్రవారం, అంటే జూన్ 3 న AHA నుండి స్ట్రీమ్ అవుతుంది.
KGF: చాఫ్టర్ 2
ప్రస్తుతం వస్తున్న రిపోర్ట్స్ చెబుతున్నట్లు కనుక జరిగితే, KGF: చాఫ్టర్ 2 సినిమా కూడా జూన్ 3 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో సబ్ స్క్రైబర్స్ అందరికి అందుబటులోకి రావచ్చు. వాస్తవానికి, KGF: చాఫ్టర్ 2 ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ నుండి రెంట్ చెల్లించి చూసే పద్దతిలో అందుబాటులో వుంది మరియు దీనికోసం 199 రూపాయలు అదనంగా చెల్లించాల్సి వస్తుంది. KGF: చాఫ్టర్ 2 రిలీజైన ప్రతి చోటా భారీ కలక్షన్స్ వసూలు చేసింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1,000 కోట్లు కంటే ఎక్కువ వసూళ్లను సాధించింది.