UIDAI: ఇప్పుడు ఆధార్ అప్డేట్ ఉచితం..ఎప్పటి వరకూ అంటే.!

HIGHLIGHTS

ఆధార్ కార్డ్ సమాచారాన్ని అప్‌డేట్ చేయాలని కేంద్రం సూచించింది

ఆధార్ అప్డేట్ పైన ఛార్జ్ చేస్తున్న ఫీజును చెల్లించవలసిన అవసరం లేదని కూడా తెలిపింది

ఈ ఉచిత ఆధార్ అప్డేట్ లబ్ధిని ప్రజలు పొందవచ్చు

UIDAI: ఇప్పుడు ఆధార్ అప్డేట్ ఉచితం..ఎప్పటి వరకూ అంటే.!

UIDAI: ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ చేసిన తేదీ మొదలు ప్రతి 10 సంవత్సరాకు ఒక్కసారి ఆధార్ కార్డ్ హోల్డర్స్ అందరూ కూడా వారి ఆధార్ కార్డ్ సమాచారాన్ని అప్‌డేట్ చేయాలని కేంద్రం సూచించింది. దీనికి అనుగుణంగా ఆధార్ అప్డేట్ పైన ఛార్జ్ చేస్తున్న 25 రూపాయల ఫీజును చెల్లించవలసిన అవసరం లేదని కూడా తెలిపింది. అయితే, ఈ ఉచిత అప్డేట్ అవకాశాన్ని కేవలం మూడు నెలల గడువుతో ప్రకటించింది. వాస్తవానికి, సెంట్రల్ ఐడెంటిటీ డేటా రిపోజిటరీ (CIDR) లో ప్రజల యొక్క ఖచ్చితమైన సమాచారం ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడానికీ మరియు నిర్వహింహచడానికి ఈ విధానం సహాయపడుతుందని కేంద్రం తెలిపింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ముందుగా, ఆధార్ కార్డ్ అప్డేట్ కోసం ఆధార్ పోర్టల్ నుండి అప్డేట్ చేసుకోవడానికి రూ.25 చెల్లించవలసి వచ్చేది. అయితే, నిన్న UIDAI చేసిన కొత్త ప్రకటన ద్వారా మూడు నెలల పాటు ఆధార్ అప్డేట్ కోసం ఈ రూ.25 ఫీజు చెల్లించ వలసిన లేకుండా ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చని తెలిపింది. మార్చి 15 నుండి జూన్ 15 వరకూ ఈ ఉచిత ఆధార్ అప్డేట్ లబ్ధిని ప్రజలు పొందవచ్చు. 

వాస్తవానికి, దేశంలో అన్ని పనులకు ప్రతిగా ఉపయోగించే ఐడెంటిటీ ప్రూఫ్ గా ఆధార్ అగ్ర స్థానంలో నిలుస్తుంది. అంటే, అన్ని ప్రభుత్వ  సర్వీస్ మరియు పథకాల లభ్ది కోసం ఆధార్ అనుసంధానం అవసరం అవుతుంది. అయితే, ఆధార్ కార్డ్ లో సరైన వివరాలు లేని కారణంగా ఆధార్ కార్డ్ హోల్డర్లు కొన్నిసార్లు ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే, కేంద్రం అందించిన ఈ కొత్త ఆధార్ అప్డేట్ ద్వారా వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకునే వీలుంది.                   

ఇక ఈ కొత్త ఆధార్ నిబంధన గురించిన పూర్తి వివరాల్లోకి వెళితే, ఆధార్ కార్డ్ హోల్డర్ లు  ఆధార్ కోసం నమోదు చేసుకున్న తేదీ నుండి ప్రతి 10 సంవత్సరాలకు వారి ఆధార్‌ తో ముడిపడిన వారి సపోర్ట్ పత్రాలను తగ్గించుకోవచ్చు. దీనికోసం, కనీసం ఒక్కసారైనా, ప్రూఫ్  సమర్పించి, అప్‌డేట్ చేయవలసి ఉంటుంది. అంతేకాదు, దీనితో CIDR లో మీ సమాచారం యొక్క ఖచ్చితత్వం నిర్ధారించబడుతుందని ప్రభుత్వం చెబుతోంది.

అయితే, ఈ రూల్ ను ఖచ్చితంగా పాటించాలనే ఒత్తిడిని మాత్రం ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఈ ప్రక్రియ మ్యాండేట్రి గా నిర్వహించాలని తెలుపలేదు. కానీ, ప్రజలు తమ ఆధార్ సపోర్టింగ్ డాక్యుమెంట్‌లను అప్‌డేట్ చేసుకోవాలని మాత్రం ప్రభుత్వం సూచించింది. మీరు ప్రూఫ్ గా సమర్పించ తగిన ఐడెంటిటీ ప్రూఫ్ లలో పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ID కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి మరిన్ని ప్రభుత్వ గుర్తింపు పత్రాలు ఉన్నాయి. 

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo