రేపు ఫైన్ కడతారాలేక ఈరోజే పాన్-ఆధార్ లింక్ చేస్తారా?
ఈరోజుతో పాన్-ఆధార్ గడువు ముగుస్తుంది.
పాన్-ఆధార్ లింక్ చేయనట్లయితే ఫైన్
PAN పూర్తిగా నిలిపివేయ బడుతుంది.
ఈరోజుతో పాన్-ఆధార్ లింక్ కోసం విధించిన ఆఖరి గడువు ముగుస్తుంది. ఈరోజు లోపు పాన్-ఆధార్ లింక్ చేయనట్లయితే ఫైన్ కట్టడడంతో పాటుగా చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. వాస్తవానికి, గత సంవత్సరమే దేశవ్యాప్తంగా పాన్-ఆధార్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉండగా, కరోనా మహమ్మారి కారణంగా దీన్ని కొనసాగించాల్సి వచ్చింది. ఫైనాన్స్ బిల్, 2021 లో దీని కోసం సవరణ చేసింది. దీని ప్రకారం, పైన పైన తెలిపిన 1,000 ఫైన్ తో పాటుగా ఆ వ్యక్తి యొక్క PAN పూర్తిగా నిలిపివేయ బడుతుంది.
Surveyఅంటే, మార్చి 31 లోపుగా PAN-AADHAAR లింక్ చేయని వారి PAN పనిచేయ్యకపోవడమే కాకుండా 1000 ఫైన్ కూడా సమర్పించుకోవాలన్న మాట. క్లియర్ గా చెప్పాలంటే, ఈరోజు లోపల పాన్-ఆధార్ లింక్ చెయ్యనట్లయితే ఫైన్ కట్టడంతో పాటుగా పాన్ కార్డు ను కూడా కోల్పోవాల్సి వస్తుంది.
అందుకే, వెంటనే మీ PAN-AADHAAR లింక్ చెయ్యడం మంచిది. దీని కోసం ఆఫీసుల చుట్టూ లేదా నెట్ సెంటర్లు లేదా మరెవరినైనా సంప్రదించాల్సిన పనిలేదు. పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానించడానికి, ఆదాయ పన్ను శాఖ కొత్త ఎస్ఎమ్ఎస్ సేవను ప్రారంభించింది.
దీని కోసం మీరు UIDPAN అని టైప్ చేసిన తరువాత స్పేస్ ఇచ్చి మీ ఆధార్ నంబరును ఎంటర్ చేసి ఈ SMS ను 567678 నంబరుకు లేదా 56161 కు పంపాలి. UIDPAN<స్పెస్><ఆధార్ నంబర్><స్పేస్><పాన్ నంబర్> ఈ ఫార్మాట్ లో 567678 నంబరుకు లేదా 56161 కు పంపాలి. అదనంగా, ఇ-ఫైలింగ్ వెబ్సైట్ విభాగానికి ఇది అనుసంధానించబడుతుంది.
ఉదాహరణ : UIDPAN 123456123456 ABCDF2019A
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile