అమెజాన్ ప్రైమ్ డే నుండి టెక్నో బడ్జెట్ 11GB ర్యామ్ స్మార్ట్ ఫోన్ సేల్ కి వస్తుంది. టెక్నో ఇండియాలో ఇటీవల విడుదల చేసిన Tecno Spark 9 స్మార్ట్ ఫోన్ వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో కలిపి 11GB వరకూ ర్యామ్ తో వస్తుందని కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ.9,499 ధరలో అందించింది మరియు ఈ ఫోన్ అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి మొదటి సారిగా సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ధర, స్పెక్స్ మరియు పూర్తి వివరాలు తెలుసుకోండి.
Survey
✅ Thank you for completing the survey!
Tecno Spark 9: ధర
Tecno Spark 9 స్మార్ట్ ఫోన్ 6GB ర్యామ్ మరియు 5GB వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో మొత్తంగా 11GB ర్యామ్ మరియు 128 ఇంటర్నల్ స్టోరేజ్ తో కేవలం రూ.9,499 రూపాయల ధరతో వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ ప్రైమ్ డే మొదటి రోజైన జూలై 23 నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
టెక్నో స్పార్క్ 9 స్మార్ట్ ఫోన్ 6.6-ఇంచ్ HD డిస్ప్లేని 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి వుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Helio G37 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 6GB ర్యామ్ కి జతగా 5GB టోటల్ 11GB ర్యామ్ వరకు కలిగి ఉంటుందని దీనికి జతగా 128GB స్టోరేజ్ కూడా జత చేయబడుతుంది. ఈ ఫోన్ ఇన్ఫినిటీ బ్లాక్ మరియు స్కై మిర్రర్ అనే రెండు అక్షర్షణీయమైన కలర్ అప్షన్లలో వస్తుంది.
ఇక ఈ ఫోన్ కెమెరాల పరంగా చూస్తే, టెక్నో స్పార్క్ 9 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ తో వచ్చింది. ఇందులో 13MP ప్రధాన కెమెరాతో జతగా మరొక కెమెరా ఉంటుంది. సెక్యూరిటీ పరంగా, రియర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా వుంది. Tecno Spark 9 లేటెస్ట్ ఆండ్రాయిడ్ 12OS తో లాంచ్ చేయబడుతుంది మరియు 5,000 mAh బిగ్ బ్యాటరీతో వస్తుంది.