Census 2027: స్వయంగా ఆన్లైన్ లో జనగణన వివరాలు నమోదు చేసుకునే అవకాశం.. 16 భాషల్లో సదుపాయం.. పూర్తి వివరాలు!
దేశవ్యాప్తంగా జనగణన 2027 ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది
న్‌లైన్ లో నమోదు చేసుకునేందుకు Self-Enumeration సదుపాయం తెచ్చింది
ఈ కార్యక్రమం ద్వారా ఇంటి వద్ద నుంచే జనగణనకు సంబంధించిన వివరాలను సమర్పించవచ్చు
Census 2027: దేశవ్యాప్తంగా జనగణన 2027 ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రజలు తమ కుటుంబ వివరాలను స్వయంగా ఆన్లైన్ లో నమోదు చేసుకునేందుకు Self-Enumeration (సెల్ఫ్ ఎన్యూమరేషన్) సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఇంటి వద్ద నుంచే జనగణనకు సంబంధించిన వివరాలను సమర్పించవచ్చు. అంతేకాదు, ప్రజలకు సౌకర్యంగా ఉండేలా ఈ సేవను 16 భారతీయ భాషల్లో అందిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
Census 2027: ఆన్లైన్ లో వివరాలు ఎలా నమోదు చేయాలి?
జనగణన కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన https://se.census.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి మొబైల్ నంబర్ తో లాగిన్ కావాలి. లాగిన్ చేసిన తర్వాత కుటుంబానికి సంబంధించిన ప్రాథమిక వివరాలతో పాటు వ్యక్తిగత సమాచారాన్ని ఇందులో నమోదు చేయాలి. అయితే, ఇందులో మొత్తం 40 ప్రశ్నలకు మీరు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. మీరు అందించిన వివరాలు ఒకసారి పరిశీలించి సమర్పించిన తర్వాత ప్రత్యేకమైన Self-Enumeration ID (SE ID) మీకు జారీ చేస్తారు.
మీ ఇంటికి జనగణన అధికారి వచ్చినప్పుడు ఈ నంబర్ ను చూపించాల్సి ఉంటుంది. అందుకే, మీరు ఈ ఐడీని జాగ్రత్తగా భద్రపరుచుకోవలసిన అవసరం ఉంటుంది.
ఏ రాష్ట్రంలో ఎప్పటి నుంచి?
తొలి దశలో గోవా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్‌లోని మంచు ప్రభావం లేని ప్రాంతాల్లో 30 2026 నవంబర్ 30 వరకు ఆన్లైన్ లో వివరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. ఆయా ప్రాంతాల్లో డిసెంబర్ 1 నుంచి 2026 నుంచి 2027 జనవరి 4వ తేదీ వరకు ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు.
ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా మిగిలిన రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల్లో 2027 జనవరి 10 నుంచి 24 జనవరి 2027 వరకు Self-Enumeration ప్రక్రియ చేపట్టనున్నారు. అనంతరం జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఇంటింటి జనగణన నిర్వహిస్తారు.
మీ సమాచారం గోప్యంగా ఉంటుంది
ఈ పోర్టల్ లో ప్రజలు అందించే వివరాలు Census Act, 1948 ప్రకారం గోప్యంగా ఉంచుతామని ప్రభుత్వం వెల్లడించింది. ఆన్లైన్ లో వివరాలు నమోదు చేయలేని వారి కోసం ఇంటింటికి వచ్చే జనగణన అధికారులు సమాచారాన్ని సేకరిస్తారు. దేశ జనాభా, సామాజిక పరిస్థితులు, అభివృద్ధి ప్రణాళికలకు అవసరమైన గణాంకాల రూపకల్పనలో ఈ జనగణన కీలకంగా నిలవనుంది.
మీరు కూడా ఆన్లైన్ లో మీ వివరాలు అందించాలనుకునే మీరు పైన తెలిపిన విధంగా మీ వివరాలు ఆన్లైన్ లో నమోదు చేయవచ్చు. దీనికోసం మీరు ప్రత్యేకమైన సెటప్ ఏది అవసరం లేకుండా కేవలం ఇంటర్నెట్ సౌకర్యం కలిగిన స్మార్ట్ ఫోన్ యూ కలిగి ఉంటే సరిపోతుంది.