Digit.in

Jio Alert: రీఛార్జ్ గడువు ముగిస్తే ఇన్‌ కమింగ్ కాల్స్ బంద్ .. కొత్త వాయిస్ ఓన్లీ ప్లాన్లు ఇవే!

Highlights

రిలయన్స్ జియో సిమ్ ఉపయోగిస్తున్న వారికి ఒక ముఖ్యమైన అప్‌డేట్

రీఛార్జ్ ప్లాన్ వ్యాలిడిటీ ముగిసిన తర్వాత ఇన్‌ కమింగ్ కాల్స్ కూడా నిలిచిపోయే అవకాశం ఉందంటూ సందేశాలు

కాల్స్ మరియు బ్యాంక్ OTP లు మిస్ కాకుండా ఉండాలంటే రీఛార్జ్ వ్యాలిడిటీ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి

Jio Alert: రీఛార్జ్ గడువు ముగిస్తే ఇన్‌ కమింగ్ కాల్స్ బంద్ .. కొత్త వాయిస్ ఓన్లీ ప్లాన్లు ఇవే!

Jio Alert: రిలయన్స్ జియో సిమ్ ఉపయోగిస్తున్న వారికి ఒక ముఖ్యమైన అప్డేట్. మొబైల్ రీఛార్జ్ గడువు ముగిసిన తర్వాత కూడా ఇన్‌ కమింగ్ కాల్స్ అందుకోవడం పరిపాటే. అయితే, ఇక నుంచి ఇది జరగదేమో అనిపిస్తోంది. ఎందుకంటే, తాజాగా కొంతమంది జియో కస్టమర్లకు వచ్చినట్లు ప్రస్తుతం ప్రచారంలో ఉన్న SMS సారాంశం కొత్త చర్చకు దారితీసింది. అదేమిటంటే, రీఛార్జ్ ప్లాన్ వ్యాలిడిటీ ముగిసిన తర్వాత ఇన్‌ కమింగ్ కాల్స్ కూడా నిలిచిపోయే అవకాశం ఉందంటూ ఈ సందేశాలలో హెచ్చరిక ఉన్నట్లు సమాచారం.

Jio Alert: రీఛార్జ్ చేయకపోతే సిమ్ పని చేయదా?

ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్న SMS స్క్రీన్‌ షాట్ల ప్రకారం, రీఛార్జ్ గడువు ముగిసిన తర్వాత ఇన్‌ కమింగ్ కాల్స్ ఎప్పుడైనా నిలిచిపోవచ్చని యూజర్లకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై ఇప్పటివరకు జియో నుంచి కొత్తగా ఎలాంటి అధికారిక అప్డేట్ ప్రకటించలేదు. కంపెనీ ప్రస్తుత నిబంధనల ప్రకారం, వ్యాలిడిటీ ముగిసిన తర్వాత కొంత గ్రేస్ పీరియడ్ ఉండవచ్చు. ఆ తర్వాత ముందస్తు నోటీసుతో సేవలు నిలిపి వేసే అవకాశం ఉంటుంది.

Jio Alert

అలాగే, వరుసగా 90 రోజుల పాటు ఎలాంటి వినియోగం లేని సిమ్ కార్డులకు ప్రత్యేక డీ యాక్టివేషన్ నిబంధనలు వర్తిస్తాయి. కాబట్టి, రీఛార్జ్ ప్లాన్ గడువు ముగిసిన వెంటనే అన్ని జియో నంబర్‌ లలో ఇన్‌ కమింగ్ కాల్స్ ఆగిపోతాయని మనం భావించకూడదు.

జియో యూజర్లు ఏం చేయాలి?

యూజర్లు తమ మొబైల్ నంబర్‌ కు సంబంధించిన ముఖ్యమైన కాల్స్ మరియు బ్యాంక్ OTP లు మిస్ కాకుండా ఉండాలంటే రీఛార్జ్ వ్యాలిడిటీ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. అందుబాటులో ఉన్న తాజా ప్లాన్లు మరియు వాటి ప్రయోజనాలను My Jio యాప్‌ లో చూసి రీఛార్జ్ చేసుకోవచ్చు.

అయితే, ఇన్‌ కమింగ్ కాల్స్ నిలిపివేతపై జియో అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ వైరల్ SMS లను కంపెనీ అందించిన అఫీషియల్ అప్డేట్ లేడీ రూల్ గా భావించకూడదు.

జియో వాయిస్ ఓన్లీ రీఛార్జ్ ప్లాన్లు

ఒకవేళ మీరు బడ్జెట్ ధరలో ఇంటర్నెట్ అవసరం లేకుండా కేవలం కాల్స్ అండ్ SMS కోసం రీఛార్జ్ చేయాలనుకుంటే, మీకోసం జియో మంచి వాయిస్ ఓన్లీ ప్లాన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

  • రూ. 147 ప్లాన్: 22 రోజుల వ్యాలిడిటీ, అన్లిమిటెడ్ కాల్స్, 300 SMS.
  • రూ. 177 ప్లాన్: 28 రోజుల వ్యాలిడిటీ, అన్లిమిటెడ్ కాల్స్, 300 SMS.
  • రూ. 196 ప్లాన్: 30 రోజుల వ్యాలిడిటీ, అన్లిమిటెడ్ కాల్స్, 300 SMS.
  • రూ. 197 ప్లాన్: ఒక క్యాలెండర్ నెల వ్యాలిడిటీ, అన్లిమిటెడ్ కాల్స్, 300 SMS.
  • రూ. 448 ప్లాన్: 84 రోజుల వ్యాలిడిటీ, అన్లిమిటెడ్ కాల్స్.
  • రూ. 1,748 ప్లాన్: 336 రోజుల వ్యాలిడిటీ, అన్లిమిటెడ్ కాల్స్.

ఈ బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ లను బడ్జెట్ యూజర్లు చూడవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

View full profile