ఆగస్ట్ 31న విండోస్ 10 ఓఎస్ లాంచ్?

HIGHLIGHTS

ఆన్ లైన్ రిటేలర్ అనుకోకుండా విండోస్ ప్రైసింగ్ మరియు విడుదల తేది లను బయట పెట్టేసారు.

ఆగస్ట్ 31న విండోస్ 10 ఓఎస్ లాంచ్?

Newwgg.com అనుకోకుండా విండోస్ 10 ధర మరియు విడుదల తేదీలను బయటకు విడుదల చేసేసింది. కంప్యూటర్లు కంపెనీలకు OS వెర్షన ను వాళ్ల స్పెసిఫికేషన్స్ లిస్టు లో వ్రాయటం అలవాటు. అలా ఆ లిస్టింగుల్లో ఈ విషయం Newwgg.com లో  బయట పడింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ సంవత్సరం సమ్మర్ లో రిలీజ్ అవుతుంది అని చెప్పిన మైక్రోసాఫ్ట్ ఇప్పటివరకూ దాని అధికారిక విషయాల పై ఎటువంటి మాట చెప్పలేదు. ఈ నేపధ్యంలో ఆగస్ట్ 31 న విండోస్ 10 OEM కాపీస్ విడుదల అవనున్నట్లు తెలిసింది. ప్రోఫెషనల్ విండోస్ 10 ఎడిషన్ 9,500 రూ. లకు , హోం ఎడిషన్ 7000 రూ. లకు లభ్యం కానున్నాయి. ZDnet సైటు ద్వారా ముందు ఈ విషయం బయట పడింది.

విండోస్ 7 మరియు విండోస్ 8 యూజర్స్ కు  మైక్రోసాఫ్ట్ విండోస్ 10 ను  ఫ్రీ అపగ్రేడ్ గా ఇవ్వనుంది అని గతంలో తెలిపింది. అయితే పైరేటెడ్ విండోస్ వెర్షన్స్ కి కూడా విండోస్ 10 అప్గ్రేడ్ అవుతుంది కాని వాళ్ళ ముందు విండోస్ వెర్షన్ పైరేటెడ్ నాన్ జేన్యున్ అయితే విండోస్ 10 కూడా నాన్ జెన్యూన్ గానే అప్ గ్రేడ్ అవుతుంది. 

మోడరన్ స్టార్ట్ మెను తో విండోస్ 7 వలె కనిపిస్తున్న విండోస్ 10 రెండు మూడు సంవత్సరాలలో పెద్ద కంప్యూటర్స్ నుండి చిన్న స్మార్ట్ ఫోన్ల వరకూ బిలియన్ డివైజ్ లలో కనిపించనుంది.

                              

ఆధారం: Newsegg.com , ZDNet

Silky Malhotra

Silky Malhotra

Silky Malhotra loves learning about new technology, gadgets, and more. When she isn’t writing, she is usually found reading, watching Netflix, gardening, travelling, or trying out new cuisines. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo