2022 బ్లాక్ బాస్టర్ మూవీ RRR ఇంకా తన రికార్డుల ప్రభంజనాన్ని కొనసాగిస్తూనే వుంది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడమే కాకుండా ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఇప్పుడు, రాజమౌళి చిత్రం RRR మరొక కొత్త రికార్డ్ ను కూడా సొంతం చేసుకుంది. కేవలం బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాదు OTT లో తానే నంబర్ వన్ అని నిరూపించుకుంది. RRR చిత్రం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన నాన్-ఇంగ్లీష్ చిత్రాలలో నంబర్ 1 నిలిచి అగ్రస్థానానికి చేరుకుంది. ఈ చిత్రం Netflix లో టాప్ 10 లో ఉంది మరియు నాన్-ఇంగ్లీష్ చిత్రపైన ఆధిపత్యం చెలాయించింది.
Survey
✅ Thank you for completing the survey!
కేవలం సినిమానే కాదు స్టార్ యాక్టర్స్ యొక్క అద్భుతమైన నటనా చాతుర్యం కూడా ప్రేక్షకుల కను విందు చేసింది. జూనియర్ NTR, రామ్ చరణ్, అజయ్ దేవగన్ మరియు అలియా భట్ కలిసి నటించిన ఈ యాక్షన్ చిత్రం సంవత్సరంలో అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. మొదటి వారంలో ఈ చిత్రం 18.3 మిలియన్ గంటల వీక్షణా సమయాన్ని రాబట్టింది. ఈ చిత్రం వరుసగా రెండు వారాల పాటు ప్రపంచవ్యాప్తంగా టాప్ 10 ఆంగ్లేతర చిత్రాలలో ఉంది మరియు ఈ చిత్రం 25.5 మిలియన్ గంటలకు పైగా OTT లో వీక్షించబడింది.
Zee5 లో అయితే ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళం నాలుగు భాషల్లో కూడా అత్యధికంగా వీక్షించబడిన చిత్రంగా No 1 స్థానంలో నిలిచింది. బాక్సాఫీస్ వద్ద 1100 కోట్ల వసూళ్లను రాబట్టమే కాకుండా OTT లో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల మనసు దోచుకున్నచిత్రంగా కూడా ఆర్ఆర్ఆర్ నిలిచింది.