Jio నుంచి ఈ ప్లాన్స్ మరలా చేంజ్ , రోజువారీ మరింత డేటా

Jio నుంచి ఈ ప్లాన్స్ మరలా చేంజ్  , రోజువారీ మరింత డేటా

 కంపెనీ ఖరీదు ఎక్కువైన ప్లాన్ ను పునఃపరిశీలించింది, కాని ఇప్పుడు జియో 200 రూపాయల కన్నా తక్కువ ధరతో వచ్చిన ప్లాన్స్ ని  పునఃపరిశీలించింది. రూ 149 మరియు 198 రూపాయల రెండు ప్రీపెయిడ్ ప్లాన్ల ను  జియో రివైజ్ చేసింది . రివైజ్ తరువాత, రెండు ప్లాన్లలో ముందు కంటే ఎక్కువ డేటాను ఇవ్వాలని కంపెనీ ప్రకటించింది. రెండింటి యొక్క వివరాలు గురించి తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

JIO 149 రూపీస్ ప్లాన్ – 

జియో యొక్క ఈ ప్లాన్  28 రోజులవాలిడిటీ తో వస్తుంది. రివైజ్  తరువాత, వినియోగదారులు ఈ ప్లాన్ లో రోజుకి  1.5GB డేటా మరియు మొత్తం  42 GB డేటా పొందుతారు. గతంలో ఈ ప్లాన్ లో  రోజువారీ 1 GB డేటాను మాత్రమే లభ్యం . వినియోగదారులు ఈ ప్లాన్ లో అపరిమిత కాలింగ్ (లోకల్ , STD మరియు రోమింగ్) లను  చేయవచ్చు. దీనితో పాటు వినియోగదారులు లోకల్  మరియు నేషనల్ 100 ఎస్ఎంఎస్ రోజువారీ పొందుతారు. దీనితో, వినియోగదారులు జియో యాప్స్ పై ఫ్రీ సబ్స్క్రిప్షన్  పొందుతారు.

JIO 198 రూపీస్ ప్లాన్ – 

జియో యొక్క ఈ ప్లాన్  28 రోజుల వాలిడిటీ తో వస్తుంది . ఈ ప్లాన్ లో, వినియోగదారులకు మొదట్లో  1.5 GB డేటా వచ్చింది. ఇప్పుడు 28 రోజులు ప్రతిరోజూ 2 GB డేటా మరియు 56 GB డేటాను  వినియోగదారులు పొందగలరు. దీనితో పాటు, అపరిమిత కాలింగ్ (లోకల్ , STD మరియు రోమింగ్), లోకల్  మరియు నేషనల్ 100 ఎస్ఎమ్ఎస్ ఫ్రీ వంటి ప్రయోజనాలతో ఈ ప్లాన్లు  వస్తాయి.

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo