47th RIL AGM నుంచి Reliance Brain పేరుతో కొత్త దేశీయ AI మోడల్ ను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ ప్రకటించారు. దేశంలో ఉన్న నలుమూలలకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను చేరవేసే లక్ష్యంతో ఈ కొత్త ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ ను తీసుకు వస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కొత్త మోడల్ వ్యవసాయం, ఎడ్యుకేషన్, రిటైల్, ఎంటర్టైన్మెంట్ మరియు హెల్త్ కేర్ తో సహా అన్ని కేటగిరీల లో తన సహాయం చేస్తుందని తెలిపారు.
Survey
✅ Thank you for completing the survey!
Reliance Brain అంటే ఏమిటి?
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో చాలా త్వరగా మరియు బెటర్ ప్రెడిక్షన్ మరియు డెసిషన్స్ తీసుకోవడానికి వేగంగా పని చేసే విధంగా రిలయన్స్ కొత్త మోడల్ ను అందించింది.దీనికి రిలయన్స్ బ్రెయిన్ అని నామకరణం చేసింది. ఇది AI సహాయంతో చాలా వేగంగా పనులు చేయడమే కాకుండా కస్టమర్ అవసరాలు త్వరితగతిన గుర్తించడానికి సహాయం చేస్తుందని అంబానీ తెలిపారు.
ఇది మాత్రమే కాదు ఇతర రిలయన్స్ ఆపరేటింగ్ కంపెనీలు మరియు ఇతర ఎంటర్ప్రైజెస్ కు సహాయం చేయడానికి శక్తివంతమైన AI సర్వీస్ ప్లాట్ ఫామ్ ను కూడా పరిచయం చేస్తున్నట్లు కూడా ఈ మీటింగ్ నుంచి ప్రకటించారు. అందరికీ AI పవర్ అందేలా ఈ పవర్ ఫుల్ AI మోడల్స్ ను సరసమైన ధరలో ఆఫర్ చేస్తాయని కూడా హామీ ఇచ్చారు.
ఇందులో నాలుగు విభాగాలను ప్రత్యేకంగా చర్చించారు. అందులో, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్,హెల్త్ కేర్ మరియు స్మాల్ బిజినెస్ ఉన్నాయి. ఈ నాలుగు విభాగాల్లో AI ని పరిచయం చేస్తునట్లు వీటిని మరింత వేగంగా మరియు శక్తివంతంగా మార్చడానికి కృషి చేస్తామని అంబానీ పేర్కొన్నారు.
రిలయన్స్ బ్రెయిన్ AI శక్తితో కొత్త యాప్స్ మరియు మరిన్ని ఇతర సర్వీసులు తీసుకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మాత్రమే కాదు ప్రస్తుతం నెమ్మదిగా కొనసాగుతున్న చాలా మాన్యువల్ పనులు ఈ AI బ్రెయిన్ సహాయం తో చాలా వేగంగా నిర్వహించే అవకాశం కూడా ఉంటుంది.