Paytm కు షాకిచ్చిన RBI..మరి యూజర్ల సంగతి ఏంటి.!
దేశంలో అతిపెద్ద పేమెంట్స్ కంపెనీ Paytm కు RBI షాకిచ్చింది
పేటియం పేమెంట్స్ బ్యాంక్ యొక్క అనేక సర్వీస్ ల పైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిషేదం విధించింది
రూల్స్ ను పక్కన పెట్టిన కారణంగా పేటియం పేమెంట్స్ బ్యాంక్ సర్వీస్ ల పైన నిషేధం
దేశంలో అతిపెద్ద పేమెంట్స్ కంపెనీ Paytm కు RBI షాకిచ్చింది. వాస్తవానికి, షాక్ ఇచ్చింది అని చెప్పడం కంటే కొరడా ఝళిపించిందని చెప్పడం సమంజసం అవుతుంది. ఎందుకంటే, పేటియం పేమెంట్స్ బ్యాంక్ యొక్క అనేక సర్వీస్ ల పైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిషేదం విధించింది. దేశంలో అత్యంత వేగంగా ఎదిగిన ఈ అతిపెద్ద భారతీయ పేమెంట్స్ కంపెనీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెగ్యులేటరీ రూల్స్ ను సరిగ్గా పాటించని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
RBI Deadline for Paytm Services
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క రూల్స్ ను పక్కన పెట్టిన కారణంగా పేటియం పేమెంట్స్ బ్యాంక్ సర్వీస్ ల పైన నిషేధం విధించింది. ఈ పేటియం పేమెంట్స్ బ్యాంక్ నుండి పేటియం ఆఫర్ చేస్తున్న అనేక సర్వీస్ లు మరియు వాలెట్ పైన కూడా ఈ ఆంక్షలు విధించింది. ఫిబ్రవరి 29 తరువాత ఏ కస్టమర్ కూడా పేటియం నుండి UPI పేమెంట్స్, క్రెడిట్ ట్రాన్సాక్షన్ మరియు టాప్ అప్స్ ను చేసే అవకాశం ఉందని తెలిపింది.
ముఖ్యంగా, పేటియం పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్స్ నుండి ఎటువంటి కొత్త డిపాజిట్ లను సమీకరించ కూడదని ఆర్డర్ వేసింది. కేవలం అకౌంట్స్ మాత్రమే కాదు వాలెట్ లలో కూడా ఎటువంటి కొత్త అమౌంట్స్ డిపాజిట్ చేసుకోకూడని కూడా కంపెనీకి తెలిపింది.
Also Read: Gold Price Live: మార్కెట్ లో స్థిరంగా బంగారం ధర..లైవ్ అప్డేట్ తెలుసుకోండి.!
మరి వాలెట్స్ & డిపాజిట్ అమౌంట్ ఏమవుతాయి?
దీని గురించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లారిటీని ఇచ్చింది. ఫిబ్రవరి 29 లోపుగా పేటియం పేమెంట్స్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్, వాలెట్, కరెంట్ అకౌంట్, FasTtag మరియు NCMC (నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్) కార్డ్స్ తో సహా అన్నింటిలో ఉన్న ఫండ్స్ ను ఉపయోగించుకోవడం లేదా ట్రాన్స్ ఫర్ చేసుకుకోవడానికి అవకాశం వుంది.
దీనికి ఎటువంటి పరిమి లేకుండా పూర్తి ఫండ్స్ ను ట్రాన్స్ ఫర్ చేసుకునే అవకాశం వుంది. అంటే, మీ పేటియం అకౌంట్ కు సంబంధించిన మొత్తం అమౌంట్ ను మీరు మీ బ్యాంక్ అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేసుకునే లేదా ఉపయోగించుకునే వీలుంటుంది.
Paytm FasTag అకౌంట్ సంగతి ఏమిటి?
Paytm FasTag అకౌంట్ సంగతి ఏమిటి? అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే, ఎక్కవగా ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్స్ ను కలిగిన సర్వీస్ ప్రొవైడర్ గా పేటియం కొనసాగుతోంది. అయితే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధన ప్రకారం,ఫిబ్రవరి 29 తరువాత పేటియం నుండి టాప్ అప్స్ లేదా డిపాజిట్స్ స్వకరించడం జరగదు. అంటే, పేటియం ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్ ను టాప్ అప్ చేయడం కుదరదు.