సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనడానికి ముందు ఇలా చెక్ చేయండి..!

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనడానికి ముందు ఇలా చెక్ చేయండి..!
HIGHLIGHTS

కొత్త ఫోన్ ధరలో సగం ధరకే ఒక సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనే వీలుంటుంది

కొందరు తక్కువ కాలం వాడిన స్మార్ట్ ఫోన్లను కొనడానికి మొగ్గుచూపుతున్నారు

సెకండ్ హ్యాండ్ ఫోన్ తీసుకునే ముందుగా చెక్ చేసి తీసుకోవడం మంచిది

ప్రతిరోజూ ఏదోఒక కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లో కి వస్తూనే వుంది. పెరుగుతున్న టెక్నలాజితో పాటుగా స్మార్ట్ ఫోన్ల ఫీచర్ల కోసం యువత కూడా వారి ఫోన్లను త్వరగానే మార్చేస్తున్నారు. అందుకే, కొత్త స్మార్ట్ ఫోన్లు ఎన్ని వచ్చినా హాట్ హాట్ గా అమ్ముడవుతున్నాయి. మరి పాత ఫోన్ల మాటేమిటి. వాటికీ కూడా గిరాకీ బాగానే వుంది. ఎందుకంటే, కొత్త ఫోన్ ధరలో సగం ధరకే ఒక సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనే వీలుంటుంది. తమ బడ్జెట్ ను దృష్టిలో ఉంచుకొని కొందరు తక్కువ కాలం వాడిన స్మార్ట్ ఫోన్లను కొనడానికి మొగ్గుచూపుతున్నారు.     

కానీ, తక్కువ ధరలో వస్తుందని సెకండ్ హ్యాండ్ ఫోన్ ను ఎటువంటి చెకింగ్ చేయకుండా తీసుకుంటే, అగచాట్ల పాలవుతారు. మీరు తీసుకున్న ఫోన్ ఒరిజినల్ ఓనర్ కాకుండా కొట్టుకొచ్చిందయితే, మీ పరిస్థితి ఏమిటి. అందుకే, మీరు ఒక సెకండ్ హ్యాండ్ ఫోన్ తీసుకునే ముందుగా ఖచ్చితంగా చెక్ చేసి మాత్రమే తీసుకోవడం నూరుకు నూరు శాతం ఉత్తమం.

మరి ఏమి చెయ్యాలి?

డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (DoT) పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన ఫోన్లను ట్రాక్ చెయ్యడానికి సెంట్రల్ ఎక్విప్ మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్(CEIR) ని పోర్టల్ ని లాంచ్ చేసింది. ఈ పోర్టల్ నుండి మీరు కొనదలుచుకున్న ఫోన్ యొక్క వివరాలను చెక్ చెయ్యవచ్చు.

ఎలా చెక్ చెయ్యాలి ?

డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (DoT) పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన ఫోన్లను ట్రాక్ చెయ్యడానికి సెంట్రల్ ఎక్విప్ మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్(CEIR) ని పోర్టల్ నుండి మీరు తీసుకోదలుచుకున్న ఫోన్ IMEI నంబర్ తో ఫోన్ ఒరిజినల్ అవునా లేదా కొట్టుకోచిందా అని ఇక్కడ వెరిఫికేషన్ చెయ్యొచ్చు.

 

ఈ క్రింది విధంగా చెక్ చెయ్యొచ్చు

ముందుగా CEIR పోర్టల్ లోకి వెళ్ళండి

ఇక్కడ మైన్ పేజ్ లో అప్లికేషన్ లోకి వెళ్ళండి

ఇక్కడ మీకు Know Your Mobile APP మరియు IMEI  Verification అనే రెండు అప్షన్స్ వస్తాయి.

వీటిలో, IMEI  Verification అనే రెండు అప్షన్ ఎంచుకోండి

ఇక్కడ మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి OTP పొందండి

మీకు అందిన OTP ఎంటర్ చేసి ఎంటర్ చేయండి

ఇక్కడ మీరు IMEI కోసం సూచించిన బాక్స్ లో  ఇమెయిజ్ నంబర్ ఎంటర్ చేయండి

ఒకవేళ మీరు తీసుకోవాల్సిన ఫోన్ IMEI నంబర్ తెలియక పొతే *#06# తో తెలుసుకోవచ్చు

 చివరిగా, మీరు IMEI ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన వెంటనే మీకు స్టేట్స్ వివరాలు అందించబడతాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo