Realme 16 5G: సరికొత్త డిజైన్ మరియు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో లాంచ్ అయ్యింది.!

HIGHLIGHTS

రియల్‌మీ 16 సిరీస్ నుంచి ఈరోజు సరికొత్త డిజైన్ తో కొత్త ఫోన్ లాంచ్ చేసింది

రియల్‌మీ 16 5జి స్మార్ట్ ఫోన్ ను సరికొత్త డిజైన్ తో ఇండియన్ మార్కెట్లో అందించింది

ఈ స్మార్ట్ ఫోన్ తో పాటు అందించిన లాంచ్ ఆఫర్లు మరింత గొప్ప ఆకర్షణగా నిలిచాయి

Realme 16 5G: సరికొత్త డిజైన్ మరియు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో లాంచ్ అయ్యింది.!

Realme 16 5G: రియల్‌మీ 16 సిరీస్ నుంచి ఈరోజు సరికొత్త డిజైన్ తో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. అదే రియల్‌మీ 16 5జి స్మార్ట్ ఫోన్ మరియు ఈ స్మార్ట్ ఫోన్ ను సరికొత్త డిజైన్ తో ఇండియన్ మార్కెట్లో అందించింది. ముఖ్యంగా, ఈ స్మార్ట్ ఫోన్ తో పాటు అందించిన లాంచ్ ఆఫర్లు మరింత గొప్ప ఆకర్షణగా నిలిచాయి. మరి ఈ లేటెస్ట్ రియల్‌మీ స్మార్ట్ ఫోన్ ప్రైస్, ఫీచర్స్ అండ్ ఆఫర్స్ ఏమిటో చూద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Realme 16 5G: ప్రైస్

రియల్‌మీ ఈ స్మార్ట్ ఫోన్ ను కూడా మూడు వేరియంట్లలో అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ మూడు వేరియంట్ ప్రైస్ వివరాలు ఇప్పుడు చూద్దాం.

రియల్‌మీ 16 (8 జీబీ + 128 జీబీ) ప్రైస్: రూ. 31,999

రియల్‌మీ 16 (8 జీబీ + 256 జీబీ) ప్రైస్: రూ. 33,999

రియల్‌మీ 16 (12 జీబీ + 256 జీబీ) ప్రైస్: రూ. 36,999

ఈ స్మార్ట్ ఫోన్ ఎయిర్ వైట్ మరియు ఎయిర్ బ్లాక్ రెండు రంగుల్లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ముందస్తు బుకింగ్ లను ఈరోజు స్టార్ట్ చేసింది. అయితే, ఏప్రిల్ 6వ తేదీ నుంచి ఈ స్మార్ట్ ఫోన్ సెల్ కి అందుబాటులోకి వస్తుంది.

Realme 16 5G price and features

ఆఫర్స్ :

రియల్‌మీ ఈ కొత్త స్మార్ట్ ఫోన్ పై జబర్దస్త్ లాంచ్ ఆఫర్స్ ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ పై రూ. 2,000 రూపాయల వరకు అదనపు బ్యాంక్ డిస్కౌంట్ మరియు రూ. 5,000 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్లు అందించింది. అయితే, ఈ రెండు ఆఫర్స్ లో ఏదైనా ఒకటి మాత్రమే లభిస్తుంది. ఇవి కాకుండా, రూ. 1000 రూపాయల లాయల్టీ బోనస్ ఆఫర్ కూడా అందించింది.

Also Read: Redmi Note 15 SE 5G: లగ్జరీ డిజైన్ మరియు లాంగ్ బ్యాటరీతో లాంచ్ అయ్యింది.!

Realme 16 5G: ఫీచర్స్

రియల్‌మీ 16 స్మార్ట్ ఫోన్ 6.57 ఇంచ్ ఫ్లెక్సీబుల్ AMOLED స్క్రీన్ తో లాంచ్ అయ్యింది. ఈ డిస్ప్లే FHD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 4200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ DT Star D+ రక్షణతో వస్తుంది మరియు ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 6400 Turbo చిప్ సెట్ జతగా 12GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో లాంచ్ అయ్యింది.

కెమెరా పరంగా, ఈ ఫోన్ లో 50 ఎంపీ ప్రధాన కెమెరా మరియు 2 మోనో క్రోమ్ కెమెరా కలిగిన డ్యూయల్ కెమెరా సిస్టం ఈ ఫోన్లో ఉంది. అంతేకాదు, ఈ ఫోన్ లో మెయిన్ కెమెరా సెల్ఫీల కోసం సెల్ఫీ మిర్రర్ అనే కొత్త సెటప్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ లో 50MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్ మరియు రియల్ మీ Luma Color ఇమేజ్ తో పాటు ఏఐ కెమెరా ఫీచర్లు కూడా కలిగి ఉంది.

ఈ ఫోన్ ను 7000 mAh బిగ్ బ్యాటరీతో లాంచ్ చేసింది. ఇది కాకుండా ఈ స్మార్ట్ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా అందించింది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo