Redmi Note 15 SE 5G: లగ్జరీ డిజైన్ మరియు లాంగ్ బ్యాటరీతో లాంచ్ అయ్యింది.!

HIGHLIGHTS

రెడ్ మీ నోట్ 15 సిరీస్ నుంచి స్పెషల్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్ నోట్ 15 SE ను ఈరోజు మార్కెట్లో పరిచయం చేసింది

ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ను లగ్జరీ డిజైన్ మరియు లాంగ్ బ్యాటరీ వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్స్ తో అందించింది

రెడ్ మీ ఈ స్మార్ట్ ఫోన్ ను మూడు వేరియంట్లలో విడుదల చేసింది

Redmi Note 15 SE 5G: లగ్జరీ డిజైన్ మరియు లాంగ్ బ్యాటరీతో లాంచ్ అయ్యింది.!

Redmi Note 15 SE 5G: రెడ్ మీ నోట్ 15 సిరీస్ నుంచి స్పెషల్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్ నోట్ 15 SE ను ఈరోజు ఇండియన్ మార్కెట్లో పరిచయం చేసింది. ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ను లగ్జరీ డిజైన్ మరియు లాంగ్ బ్యాటరీ వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్స్ తో అందించింది. ఈరోజే భారత్ లో సరికొత్తగా విడుదలైన ఈ రెడ్ మీ స్మార్ట్ ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్ పై ఒక లుక్కేద్దాం పదండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Redmi Note 15 SE 5G : ప్రైస్

రెడ్ మీ ఈ స్మార్ట్ ఫోన్ ను మూడు వేరియంట్లలో విడుదల చేసింది. ఈ ఫోన్ మూడు వేరియంట్ ధరలు లిస్ట్ ఈ క్రింద చూడవచ్చు.

రెడ్ మీ నోట్ 15 SE 5జి ( 6GB + 128GB) ప్రైస్ : రూ. 19,999

రెడ్ మీ నోట్ 15 SE 5జి ( 8GB + 128GB) ప్రైస్ : రూ. 21,999

రెడ్ మీ నోట్ 15 SE 5జి ( 6GB + 256GB) ప్రైస్ : రూ. 23,999

ఈ స్మార్ట్ ఫోన్ క్రిమ్సన్ రిజర్వ్, ఫ్రొస్టెడ్ వైట్ మరియు కార్బన్ బ్లాక్ మూడు రంగుల్లో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఏప్రిల్ 7వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. . ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ మరియు షియోమీ సైట్స్ నుంచి లభిస్తుంది.

Redmi Note 15 SE 5G

ఆఫర్స్ :

ఈ స్మార్ట్ ఫోన్ పై రూ. 2000 రూపాయల అదనపు చేంజ్ బోనస్ మరియు రూ. 2,000 బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. అయితే, ఈ రెండు ఆఫర్స్ లో ఏదైనా ఒకటి మాత్రమే అందుకునే ఛాన్స్ ఉంటుంది. HDFC, SBI మరియు ICICI మూడు బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ తో ఈ అదనపు బ్యాంకు డిస్కౌంట్ లభిస్తుంది.

Also Read: అత్యంత చవక ధరలో 55 ఇంచ్ QLED Smart Tv ఆఫర్ చేస్తున్న ఫ్లిప్ కార్ట్.!

Redmi Note 15 SE 5G : ఫీచర్స్

రెడ్ మీ నోట్ 15 స్పెషల్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్ కేవలం 7.35mm మందంతో చాలా స్లీక్ డిజైన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6.77 ఇంచ్ కర్వుడ్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఇది 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, FHD+ రిజల్యూషన్ మరియు 3200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 6 Gen 3 ప్రోసెసర్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ లో 8 జీబీ ర్యామ్ మరియు 256 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ లో వెనుక రియల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ కెమెరా సెట్ అప్ లో 50 ఎంపీ ప్రధాన కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ లో ముందు 20 ఎంపీ కెమెరా కూడా ఉంటుంది. స్మార్ట్ ఫోన్ 4k వీడియో రికార్డింగ్ సపోర్ట్ మరియు గొప్ప ఏఐ కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో 5800 mAh బిగ్ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జ్ మరియు 18W రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP65 అండ్ 64 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo