అత్యంత చవక ధరలో 55 ఇంచ్ QLED Smart Tv ఆఫర్ చేస్తున్న ఫ్లిప్ కార్ట్.!
కొత్త స్మార్ట్ టీవీ కొనాలని ఎదురుచూస్తున్న యూజర్ల కోసం ఈరోజు ఒక గొప్ప స్మార్ట్ టీవీ ఆఫర్ ఎదురు చూస్తోంది
ఫ్లిప్ కార్ట్ ఈరోజు అత్యంత చవక ధరలో 55 ఇంచ్ QLED Smart Tv ఆఫర్ చేస్తోంది
ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ ను ఏమాత్రం మిస్ చేసుకోకండి
కొత్త స్మార్ట్ టీవీ కొనాలని ఎదురుచూస్తున్న యూజర్ల కోసం ఈరోజు ఒక గొప్ప స్మార్ట్ టీవీ ఆఫర్ ఎదురు చూస్తోంది. ఫ్లిప్ కోర్ట్ ఈరోజు అత్యంత చవక ధరలో 55 ఇంచ్ QLED Smart Tv ఆఫర్ చేస్తోంది. కాబట్టి, ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ ను ఏమాత్రం మిస్ చేసుకోకండి. ఇది గత సంవత్సరం చివరి సమయంలో విడుదలైన క్యూలెడ్ స్మార్ట్ టీవీ డాల్బీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
Survey55 ఇంచ్ QLED Smart Tv : ఆఫర్
థామ్సన్ ఇండియన్ మార్కెట్లో జియో టెలి ఓఎస్ తో కొత్తగా విడుదల చేసిన 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీని ఈరోజు ఈ డిస్కౌంట్ ధరలో ఆఫర్ చేస్తోంది. ఈ టీవీని ఈరోజు 35% డిస్కౌంట్ తో రూ. 26,499 ఆఫర్ ధరలో సేల్ అందించింది. ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీని HSBC క్రెడిట్ కార్డ్ తో కొనే వారికి రూ. 1,750 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ టీవీ కేవలం రూ. 24,749 రూపాయల అతి చవక ధరలో మీకు లభిస్తుంది.
Also Read: App Store లో భారీ అప్‌డేట్: తెలుగు భాషతో సహా 11 భాషల్లో అందుబాటులో ఉంది.!
థామ్సన్ 55 ఇంచ్ QLED Smart Tv : ఫీచర్స్
ఈ థామ్సన్ స్మార్ట్ టీవీ 55 ఇంచ్ పరిమాణం కలిగిన క్యూలెడ్ స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 450 నిట్స్ బ్రైట్నెస్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ బెజెల్ లెస్ డిజైన్ తో కూడా ఆకట్టుకుంటుంది. ఈ థామ్సన్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ 4K HDR సపోర్ట్ మరియు 4K అప్ స్కేలింగ్ ఫీచర్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ జిఓ టెలీ OS పై నడుస్తుంది.

సౌండ్ పరంగా, ఈ స్మార్ట్ టీవీ 2 సబ్ ఉఫర్ స్పీకర్లు కలిగి ఉంటుంది మరియు టోటల్ 48W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. అంతేకాదు, ఈ టీవీ డాల్బీ ఆడియో మరియు డాల్బీ డిజిటల్ ప్లస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ టీవీ బిల్ట్ ఇన్ Wi-Fi, USB, HDMI, ఆప్టికల్, ఈథర్నెట్ మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంటుంది.
ఈరోజు ఈ థామ్సన్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ మీకు అతి చవక దరలో లభిస్తుంది. ఈ టీవీ ఫ్లిప్ కార్ట్ నుంచి 4 స్టార్ రేటింగ్ మరియు మంచి రివ్యూలు అందుకుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile