App Store లో భారీ అప్‌డేట్: తెలుగు భాషతో సహా 11 భాషల్లో అందుబాటులో ఉంది.!

HIGHLIGHTS

App Store ఒక కీలక అప్‌డేట్‌ తో మీ ముందుకు వచ్చింది

ఆపిల్ స్టోర్ ఇప్పుడు తెలుగు సహా మొత్తం 11 కొత్త భాషలకు సపోర్ట్‌ కలిగి ఉంది

యూజర్ బేస్ ను దృష్టిలో ఉంచుకొని ఆపిల్ ఈ కీలక అప్‌డేట్‌ విడుదల చేసింది

App Store లో భారీ అప్‌డేట్: తెలుగు భాషతో సహా 11 భాషల్లో అందుబాటులో ఉంది.!

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లకు సేవలందిస్తున్న App Store ఒక కీలక అప్‌డేట్‌ తో మీ ముందుకు వచ్చింది. అదేమిటంటే, ఇప్పటి వరకు దేశంలో కేవలం ఆంగ్ల భాషలో మాత్రమే అందుబాటులో ఉన్న ఆపిల్ స్టోర్ ఇప్పుడు తెలుగు సహా మొత్తం 11 కొత్త భాషలకు సపోర్ట్‌ కలిగి ఉంది. దేశంలో పెరిగిన ఐఫోన్ మరియు ఐప్యాడ్ యూజర్ బేస్ ను దృష్టిలో ఉంచుకొని ఆపిల్ ఈ కీలక అప్‌డేట్‌ విడుదల చేసింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

App Store అప్‌డేట్:

ఆపిల్ అందించిన కొత్త అప్‌డేట్ ద్వారా యాప్ డిస్క్రిప్షన్, యాప్ టైటిల్ మరియు రేటింగ్ అండ్ రివ్యూ వంటివి కొత్తగా అందించిన 11 భాషల్లో అందుతాయి. అంటే, ఆపిల్ స్టోర్ ను తెలుగు సహా 11 దేశీయ భాషల్లో అందించవచ్చు.

App Store అప్‌డేట్: ఏ భాషలు అందించింది?

తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, ఒరియా, పంజాబీ, స్లోవేనియా మరియు ఉర్దూ మొత్తం 11 భాషల్లో అందుబాటులో వచ్చింది.

App Store Update

ఇది ముఖ్యమైన అప్‌డేట్ ఎందుకు అవుతుంది?

ఇది నిజంగా చాలా ముఖ్యమైన అప్డేట్ అవుతుంది. ఎందుకంటే, ఈ అప్డేట్ తో యూజర్లు తమ మాతృభాషలో యాప్స్ అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, యాప్ ను ఉపయోగించడం మరింత సులభం అవుతుంది.

డెవలపర్స్ కు కూడా మంచి అవకాశం అవుతుంది మరియు డౌన్ లోడ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది, ఎందుకంటే, యూజర్ మాతృభాషలో డెవలపర్స్ యూజర్ ను రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ రాని వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ చర్యతో డిజిటల్ గ్యాప్ కూడా తగ్గుతుంది.

Also Read: Vivo, Redmi మరియు Realme నుంచి మూడు కొత్త ఫోన్లు రేపు లాంచ్ అవుతున్నాయి.!

యూజర్లకు లాభం ఏమిటి?

ఈ కొత్త అప్డేట్ తో తెలుగు యూజర్లకు అన్ని యాప్స్ కూడా తెలుగులో అందుతాయి. దీని వలన వివరాలు సులభంగా చదవగలరు మరియు సరైన యాప్స్ ఎంచుకోవడం కూడా చాలా సులభం అవుతుంది. అంతేకాదు, భవిష్యత్తులో ప్రాంతీయ భాషల్లో అభివృద్ధి మరింత పెరుగుతుంది.

యాప్ స్తోర్ లో ఈ కొత్త అప్‌డేట్ ద్వారా తెలుగు యూజర్లకు మరింత సులభమైన మరియు పర్సనలైజ్డ్ ఎక్స్ పీరియన్స్ లభించనుంది. భవిష్యత్తులో తెలుగు వంటి ప్రాంతీయ భాషల్లో టెక్నాలజీ మరింత వేగంగా అభివృద్ధి చెందనుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo